Kangana Ranaut..కంగనా రనౌత్ (Kangana Ranaut).. బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈమె.. హీరోయిన్ గానే కాకుండా అటు ఈ మధ్యనే మండి ప్రాంతానికి ఎంపీ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే కంగనా రనౌత్ దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) బయోపిక్ గా తెరకెక్కిన ఎమర్జెన్సీ(Emergency ) మూవీలో ఇందిరాగాంధీ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. అయితే ఎమర్జెన్సీ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో ఇరుక్కొని, చివరికి 2025 జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎమర్జెన్సీ మూవీ అంత హవా చూపించకపోయినప్పటికీ.. ఎంతో మంది విమర్శకులు మాత్రం ఈ సినిమాని చూసి ప్రశంసలు కురిపించారు.అలాగే ఈ సినిమా చూసిన తర్వాత తనకి ఎన్నో ప్రశంసలు దక్కాయి అంటూ కంగనా రనౌత్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.
పనికిమాలిన అవార్డ్స్ కంటే ఈ చీరే గొప్పది – కంగనా..
అయితే తాజాగా ఆ పనికిమాలిన అవార్డుల కంటే ఈ చీర నాకెంతో విలువైనది.. గొప్పది అంటూ సోషల్ మీడియా ఖాతాలో కంగనా రానౌత్ పెట్టిన పోస్ట్ బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఇంతకీ ఆ పోస్ట్ లో ఉంది ఏంటో ఇప్పుడు చూద్దాం.. కంగనా రనౌత్ తాజాగా తనకి ఓ అభిమాని పంపించిన శారీకి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. “పనికిమాలిన అవార్డుల కంటే ఈ చీర ఎంతో ఉత్తమమైనది” అంటూ రాసుకొచ్చింది. అయితే నిత్యానంద (Nithyananda) అనే వ్యక్తి కంగనా నటించిన ఎమర్జెన్సీ మూవీని చూసి దాన్ని అభినందిస్తూ.. ఆ సినిమాలో నటించిన కంగనా రనౌత్ కి ఒక కాంజీవరం చీరని గిఫ్ట్ గా పంపించారట.అయితే ఈ చీర అందుకున్న కంగనా ఎంతో సంతోషపడి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.అయితే ప్రస్తుతం కంగనా రనౌత్ పెట్టిన ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
Hebba Patel Odela 2: నా పాత్ర అంతా అక్కడే మగ్గిపోతుంది.. ‘ఓదెల 2’ స్టోరీ లీక్ చేసిన హెబ్బా
బాలీవుడ్ అవార్డ్స్ పై కంగనా అసహనం..
ఇప్పుడే కాదు కంగనా చాలాసార్లు బాలీవుడ్ లో ఇచ్చే అవార్డులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో వచ్చే అవార్డులన్నీ సినిమాను చూసి కాదు బంధుప్రీతితో ఇస్తారు అని నెపోటిజం గురించి ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా.ఇక కంగనా రనౌత్ చివరిగా నటించిన సినిమా కూడా ఎమర్జెన్సీ.. ఈ సినిమా తర్వాత మరో సినిమా ఈమె నుంచీ రాలేదు.ప్రస్తుతం కంగనా రనౌత్ రాజకీయాల్లో బిజీ అయిపోయింది. ఇక కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ బయోపిక్ లో చేసినప్పటికీ ఈ హీరోయిన్ మాత్రం బిజెపి తరఫున రాజకీయాల్లోకి వచ్చింది. ఇక కంగనా రనౌత్ తన సొంత రాష్ట్రం అయినటువంటి హిమాచల్ ప్రదేశ్ లోని మండి అనే లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచింది. ఇక అంతేకాదు ఇటీవల ఒక కేఫ్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. హిమాలయాల్లో ప్రారంభమైన ఈ కేఫ్ అద్భుతమైన టీ రుచులను అందిస్తుంది అని ఇటీవలే కంగనా తెలిపింది.