Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. అనారోగ్యం సమస్యలతో పాటుగా, వయో భారం పైన పడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త విన్న బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు..
87 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. మనోజ్ కుమార్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడుగా, దర్శకుడుగా పలు సినిమాలకు పనిచేసిన ఆయనకు ఎన్నో అవార్డులు వరించాయి.. 1937 లో ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హరిక్రిష్ణ గోస్వామి తన స్క్రీన్ నేమ్ మనోజ్ కుమార్ తో సుపరిచితుడు. హిందీ సినిమా నటుడు, చిత్రనిర్మాత, స్క్రీన్ రైటర్, గీత రచయిత. దేశభక్తి ఇతివృత్తాలతో సినిమాలు తీయడంలో, నటించడంలో ఆయన తర్వాతే మరెవ్వరైన.. దీంతో ఆయనకు భరత్ కుమార్ అనే మారుపేరు పెట్టారు. అతను వివిధ విభాగాలలో ఒక జాతీయ చలనచిత్ర పురస్కారం, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నాడు.. అలాగే క్రాంతి, వో కౌన్ థి, పురబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కపుడా ఔర్ మక్కాన్ లాంటి చిత్రాలతో ప్రఖ్యాతి చెందాడు. 2015 సంవత్సారినకి గాను ఆయన అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నాడు. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది..
చలన చిత్ర పరిశ్రమలో ఈయనకు గొప్ప స్థానం ఉంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక పర్సనల్ జీవితం విషయానికొస్తే.. హరికృష్ణ గోస్వామి 1937 జూలై 24 అబోటాబాద్, వాయవ్య సరిహద్దు ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా లో జన్మించారు. శశి గోస్వామిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం.. కునాల్ గోస్వామి, విశాల్ గోస్వామి. ఈయన కేవలం సినిమాలు మాత్రమే కాదు. రాజకీయాల్లో కూడా రానించాడు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఆయన చురుగ్గా ఉండేవాడు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీతో పాటుగా, రాజకీయ వర్గాల్లో కూడా విషాదాన్ని నింపింది. యావత్ సినీ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి ఛేకూరాలని కోరుతున్నారు. నేడు సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం.