Manchu Lakshmi:మంచు లక్ష్మీ (Manchu Lakshmi).. ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మంచు మోహన్ బాబు (Mohan babu) నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, హీరోయిన్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ రేంజ్ సక్సెస్ లభించలేదని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ విలన్ గా కూడా దూసుకుపోతున్న ఈమె ఐదు సంవత్సరాలుగా.. మీరు పడిన నరకం చూసాను.. వారంతా మీకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్ మంచు లక్ష్మి ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసింది? ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పాలి? అంటూ తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేస్ నుండి బయటపడ్డ రియా..
అసలు విషయంలోకి వెళ్తే. బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Raj Puth) మృతి కేసులో రియా చక్రవర్తి (Rhea Chakraborty)కి ఎలాంటి సంబంధం లేదని, తాను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. గత ఐదేళ్లుగా నిందలు మోస్తూ ..ఒంటరి పోరాటం చేస్తున్న రియా చక్రవర్తికి ఈ కేసు నుంచి ఉపశమనం లభించినట్లు అయ్యింది. ఇకపోతే సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందారు. ఆయన మృతి వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అటు సుశాంత్ సింగ్ ప్రేయసి, ప్రముఖ నటి రియా చక్రవర్తి కూడా ఇందులో భాగమైందేమో అనే అనుమానాలతో పాటు ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి. దీంతో ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఆమెను అందరూ ఒక విలన్ గా చూశారు. అరెస్ట్ కూడా అయింది. ఆఖరికి జైలు జీవితం గడిపింది. ఇక విచారణతో మానసికంగా కృంగిపోయింది. ఇక తాను తప్పు చేయలేదన్న మాటను ఎవరు లెక్క చేయలేదు. తప్పంతా నీదేనని ఆమె నోరు కూడా నొక్కేశారు. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో ప్రాణాలు కోల్పోవడానికి కారణం నీవే అంటూ అబండాలు వేశారు. ఇలా గుండె నిండా బాధను మోస్తూనే ఒంటరిగా పోరాడింది. చివరికి నిర్దోషిగా తేలి తెల్లని కాగితంలా బయటకు వచ్చింది రియా చక్రవర్తి. ఇక ఈమె పోరాటాన్ని గుర్తుచేస్తూ మంచు లక్ష్మి ఒక పోస్ట్ పెట్టింది.
ఎన్నో అవమానాలు.. అబాండాలు.. వాళ్ళు క్షమాపణలు చెప్పాల్సిందే -మంచు లక్ష్మి..
రియా చక్రవర్తికి, ఆమె కుటుంబానికి ఎట్టకేలకు క్లీన్ చిట్ వచ్చింది. ఇలాంటి ఒకరోజు వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగదు కదా.. కాస్త ఆలస్యం అయినా సరే బయటకు రాక తప్పదు. రియా ఆమె కుటుంబం భరించలేని బాధను అనుభవించింది. సమాజం తప్పని నిందిస్తూ.. రాక్షసంగా ప్రవర్తిస్తుంటే, మీరు పోరాడిన విధానం ఎంతోమందికి ఆదర్శం. మిమ్మల్ని అవమానించారు అయినా ఎంతో హుందాగా నిలబడ్డారు. నిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్నవారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అన్యాయంగా ఒక కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారో గుర్తుచేసుకొని పశ్చాతాపడాలి. గత ఐదేళ్లుగా నరకం అంటే ఏంటో మీరు పడుతున్న బాధను నేను చూశాను. ఇది మీకు శక్తి చేకూరుస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై మీకు అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. #Justice, # TruthWins, #RheaChakraborty అంటూ కామెంట్ చేసింది మంచు లక్ష్మి. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
OTT Play Awards 2025: ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025.. విజేతలు వీరే