BigTV English

Jr NTR : తారక్ ను అవమానించిన బోణీ కపూర్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సిద్ధార్థ్..!

Jr NTR : తారక్ ను అవమానించిన బోణీ కపూర్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సిద్ధార్థ్..!

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR).. రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో హిట్ కొట్టిన ఈయన ప్రస్తుతం బాలీవుడ్ లో ‘వార్-2’ సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి ఆదిత్య చోప్రా(Adithya chopra) ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా..ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఇండియా మొత్తం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో విలన్ పాత్రలో నటించబోతున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే.. రీసెంట్ గా ఓ డిబేట్ లో బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ (Boney Kapoor) ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనని అవమానించారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ ని ఎందుకు బోణీ కపూర్ అవమానించారు అనేది చూస్తే.. రీసెంట్ గా సౌత్ అలాగే నార్త్ కి సంబంధించిన ప్రొడ్యూసర్ల మధ్య ఒక చిన్న డిబేట్ జరిగింది. ఈ డిబేట్ లో టాలీవుడ్ నుండి నిర్మాత నాగ వంశీ (Nagavamsi), హీరో సిద్ధార్థ్(Hero Siddharth) పాల్గొనగా.. బాలీవుడ్ నుండి బోణీ కపూర్ తో పాటు కొంతమంది స్టార్స్ పాల్గొన్నారు. అయితే ఈ డిబేట్ కాస్త వాడీవేడిగా జరిగింది.


ఎన్టీఆర్ కొత్త మొహమ్ అంటూ అవమానించిన నిర్మాత..

ఇందులో మా సౌత్ లో కొత్త దర్శకుడు, కొత్త హీరోని పెట్టి తీస్తే ఆ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు అని సిద్ధార్థ్ చెప్పగా.. దానికి రియాక్ట్ అయిన బోణీ కపూర్ అవును. రీసెంట్ గా ఆదిత్య చోప్రా కూడా వార్-2 సినిమా కోసం తారక్ ని తీసుకున్నారు. తారక్ కొత్త మొహం కదా అని బోణీ కపూర్ అన్నారు. ఇక బోణీ కపూర్ మాటలకి సిద్ధార్థ్ (Siddharth) ఫైర్ అయ్యి.. “ఏంటండీ.. మేము ఏం అడిగాము..? మీరేం మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ కొత్త మొహమా.. ? ఆయన సౌత్లో అతిపెద్ద హీరో.. అలాగే నార్త్ లో హృతిక్ రోషన్ పెద్ద స్టార్. ఒక పెద్ద నిర్మాత.. ఈ ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లను కలిపి ఓ సినిమా తీస్తున్నారు” అంటూ బోనీకపూర్ కి ఇచ్చి పడేశారు సిద్ధార్థ్. ఇక సిద్ధార్థ్ మాటలకి బోణీ కపూర్ కాస్త వెనక్కి తగ్గారు అని చెప్పవచ్చు..


బోణీ కపూర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..

అయితే బోణీ కపూర్ ఎన్టీఆర్ ని కొత్త మొహం అంటూ మాట్లాడడం చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అవమానంగా అనిపించింది. మా ఎన్టీఆర్ ని అలా అవమానిస్తారా? అని సోషల్ మీడియాలో బోణీ కపూర్ పై ఫైర్ అవుతున్నారు.అంతేకాదు కొత్త మొహం అని మా తారక్ అన్నని అవమానించావు.. నీ కూతురికి లైఫ్ ఇచ్చింది మా అన్ననే.. వరుస సినిమాలు చేసినా హిట్ లేని జాన్వీ కపూర్(Janhvi Kapoor) కి దేవర సినిమా ద్వారానే హిట్ వచ్చింది.
అలాంటిది మా అన్నని పట్టుకొని కొత్త మొహం అంటావా..? ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో నీ కూతుర్ని అడుగు అంటూ బోణీ కపూర్ పై ఫైర్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

బాలీవుడ్ ఆడియన్స్ కి నాగవంశీ కౌంటర్..

అయితే బోణీ కపూర్ మాత్రమే కాదు నిర్మాత నాగ వంశీ పైన కూడా కొంత మంది బాలీవుడ్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.అంత పెద్ద నిర్మాత అయిన బోణీ కపూర్ తో నాగవంశీ అలా మాట్లాడి అవమానిస్తారా ? అని అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో నాగ వంశీ పై జరిగే ట్రోలింగ్ కి ఆయన గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మేమిద్దరం ఏమి గొడవ పడలేదు. ఒకటి రెండు వీడియోలు చూసి మీరు అలా మమ్మల్ని తప్పు పట్టకండి.. డిబేట్లో మేమందరం స్నేహపూర్వక వాతావరణం లోనే మాట్లాడుకున్నాం. మీరు దాన్ని రాద్ధాంతం చేయకండి. అయినా డిబేట్ అయిపోయాక నేను బోనికపూర్ ఆప్యాయంగా కౌగిలించుకున్నాం.ఈ విషయాలు ఏవి తెలియకుండా మూర్ఖంగా మాట్లాడకండి. రెండు మూడు వీడియోలు చూసి అపార్ధాలు చేసుకుంటూ ఏవేవో కామెంట్లు చేయడం, ట్రోలింగ్ చేయడం ఇప్పటికైనా మానుకోండి అంటూ నాగ వంశీ కౌంటర్ ఇచ్చారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×