Virat – Nana Patekar: భారత్ – ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ లో టాస్ గెలిచిన బూమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఎప్పటిలానే ఈ మ్యాచ్ లో కూడా మరోసారి భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. కె.ఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10), గిల్ (20), విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (40), నితీష్ కుమార్ రెడ్డి (0).. ఇలా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా మొదటి రోజే పెవిలియన్ చేరారు.
Also Read: Gautham Gambhir: గంభీర్ కు చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్… #RIP Gambhir అంటూ !
ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలను ఆడడంలో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ.. మరోసారి అదే తప్పిదంతో తన వికెట్ ని సమర్పించుకున్నాడు. 32వ ఓవర్ వేసిన స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో థర్డ్ స్లిప్ లో ఉన్న వెబ్ స్టార్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో కోహ్లీ మొత్తం 7 సార్లు ఆఫ్ సైడ్ స్టంప్ డెలివరీలకే అవుట్ కావడం గమనార్హం.
కేవలం పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రమే సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన విరాట్ కోహ్లీని సెలబ్రిటీలు సైతం అభిమానిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుట్ అయిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ ఇండియన్ టెటోరియల్ ఆర్మీ అధికారి, మరాఠీ నటుడు నానా పటేకర్.
కోహ్లీ తొందరగా అవుట్ అయినప్పుడు తనకు ఏం అనిపిస్తుందన్న విషయాన్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకున్నాడు. ” కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం. అతడు తొందరగా అవుట్ అయితే నాకు ఆహారం తినాలని అనిపించదు” అని ట్వీట్ చేశాడు. కాగా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్కసారి మినహా కోహ్లీ ప్రతిసారి విఫలం అయ్యాడు. దీంతో అతను విఫలమైన ప్రతిసారి నానా పటేకర్ ఫాస్టింగ్ ఉంటున్నాడా..? అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
Also Read: Shubman Gill: రూ.450 కోట్ల స్కాం.. గిల్ తో పాటు మరో నలుగురికి CID నోటీసులు !
కోహ్లీ కెరీర్ ముగింపు దశకు చేరిందని.. రిటైర్మెంట్ ప్రకటించడం ముఖ్యమని క్రికెట్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. అతడు ఇక రన్స్ చేయలేడని.. నానా పటేకర్ కి ఫాస్టింగ్ కష్టాలు తప్పవని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సిరీస్ తోనే కోహ్లీ తన కెరీర్ కి ఎండ్ కార్డ్ వెయ్యాలని హితవు పలుకుతున్నారు. ఇక ప్రస్తుతం భారత జట్టు 63. 5 ఓవర్లకి 143 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (9*), ప్రసిద్ద్ కృష్ణ (0*) క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టారు.
Nana Patekar said, “Virat Kohli is a player whom I like very much. If Virat gets out early then I don’t feel like eating food”. pic.twitter.com/Ie0KlSmdrM
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 2, 2025