BigTV English

Kannappa: సెట్ లో అడుగుపెట్టిన శివుడు..

Kannappa: సెట్ లో అడుగుపెట్టిన శివుడు..

Bollywood Actor Akshay Kumar in Kannappa Movie(Today tollywood news): హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. స్టార్ ప్లస్ మహా భారత్ ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం మంచు విష్ణు.. టోటల్ ఇండస్ట్రీ మొత్తాన్ని దింపేశాడు. తెలుగు నుంచి ప్రభాస్, తమిళ్ నుంచి శరత్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్.. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, హిందీ నుంచి అక్షయ్ కుమార్.. ఇలా మొత్తాన్ని కవర్ చేశాడు.


ఇప్పటివరకు శివుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని, శివుని పాత్రలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నేడు అక్షయ్ కుమార్ కన్నప్ప సెట్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్నీ మోహన్ బాబు అధికారికంగా తెలిపాడు. అక్షయ్ కుమార్ కు మంచు కుటుంబం గ్రాండ్ గా స్వాగతం పలికింది. “సూపర్ స్టార్ మిస్టర్ అక్షయ్ కుమార్‌ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆహ్వానిస్తున్నాం. కన్నప్ప ప్రయాణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. కన్నప్పతో తెలుగు చిత్రసీమలోకి అక్షయ్ అరంగేట్రం చేస్తున్నందుకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. సాహసాలకు సిద్ధంకండి” అంటూ మంచు విష్ణు పోస్ట్ చేశాడు.

Also Read: Prabhas: అదేంటండీ.. మొన్నటివరకు శివుడు అన్నారు.. ఇప్పుడు కాదంటారేంటీ..?


ఇక అక్షయ్ కు మోహన్ బాబు పూల మాల వేసి.. శాలువా కప్పి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక అక్షయ్ నే శివుడు అని కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే ఓ మై గాడ్ సినిమాలో అక్షయ్ శివుడిగా నటించి మెప్పించాడు. మరి ఈ కన్నప్పతో అక్షయ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×