Bollywood:ఏంటి పెళ్లయిన ఏడాదికే ఈ బాలీవుడ్ నటి భర్తకు దూరంగా ఉంటోందా? విడాకులు తీసుకుంటోందా? ఎందుకు భర్తతో వేరుగా ఉంటోంది..? ఏడాదిలోపే విడిపోయే అంత కష్టం ఏమొచ్చింది? అసలు విడిపోవాలనే ఆలోచనకు కారణం ఏంటి? అంటూ ఒక బాలీవుడ్ హీరోయిన్ కి సంబంధించి వస్తున్న వార్తలపై నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ బాలీవుడ్ నటి ఎవరు? ఆమె భర్త ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ లో ప్రముఖ సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుర్భి జ్యోతి (Surbhi Jyoti) అంటే తెలియని వారు ఉండరు. పంజాబీ టీవీ, సినిమా హీరోయిన్ అయినటువంటి సుర్భి జ్యోతి పలు సీరియల్స్, సినిమాలు,షోల ద్వారా ఫేమస్ అయింది.అయితే అలాంటి సుర్భి జ్యోతి గత ఏడాది మే 24న తన ప్రియుడు సుమిత్ సూరి (Sumith Soori) ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ దాదాపు 5 సంవత్సరాల పాటూ డేటింగ్ చేసి చివరికి ఉత్తరాఖండ్ లోని ఓ రిసార్ట్ లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయింది కానీ వేర్వేరు గదిలో జీవనం..
అయితే పెళ్ళైన ఏడాదికే ఈ జంట విడిపోతున్నట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇంతకీ వీరిద్దరి విడాకుల వార్తలు నిజమేనా అనేది చూద్దాం..ప్రముఖ నటి సుర్భి జ్యోతి తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ నేను సుమిత్ సూరి ఇద్దరం వేర్వేరు గదుల్లో ఉంటున్నాం. అయితే మేమిద్దరం విడాకులు తీసుకోవట్లేదు. కానీ వేర్వేరు గదుల్లో ఉండడానికి కారణం మాకు ఎక్కువ ప్లేస్ ఉండడమే. మా ఇంట్లో ఎక్కువ స్థలం ఉండడం కారణంగా ఇద్దరం వేర్వేరు గదులను ఎంచుకున్నాం. అయితే ఇద్దరం ఒకే రంగంలో ఉన్నాం కాబట్టి ఇంటి దగ్గర నుండి కూడా వర్క్ చేస్తాం. ఆ సమయంలో ఇద్దరికీ ప్రైవసీ ఉండాలి. కాబట్టి ఎవరి గది వాళ్లకు ఉండాలని ఇద్దరం సపరేట్ గదులను ఎంచుకున్నాం. అయితే షూటింగ్ లేనప్పుడు సుమిత్ సూరి అలాగే నేను ఇద్దరం ఇంటి నుండే పని చేస్తాం. ఈ టైం లో డిస్టర్బెన్స్ కాకూడదనే ఉద్దేశంతోనే మేమిలా ఒకే ఇంట్లో ఉన్నా అప్పుడప్పుడు వేర్వేరు గదుల్లో ఉంటాము.
విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టిన నటి..
మేము ఒక ఇంట్లో ఉండి వేర్వేరు గదుల్లో ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉన్నాం.ఇక సుమిత్ సూరి తన జీవితంలో ఎక్కువ శాతం ఒంటరిగానే జీవించాడు. నేను కూడా అంతే. కాబట్టి మేమిద్దరం పరస్పరం నిర్ణయించుకొని ఈ ఆలోచన తీసుకున్నాం. నేను నా ప్రత్యేక గదిలో సొంత వార్డ్ రోబ్, సొంత బాత్రూమ్ ని కల్గి ఉన్నా. అలాగే సుమిత్ సూరికి కూడా తన గదిలో అన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి..” అంటూ విడాకుల వార్తలకు చెక్ పెట్టింది అంటూ సుర్భి జ్యోతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పడంతో చాలామంది నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు గదుల్లో ఉండడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. అయితే చాలామంది వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కావచ్చు. అందుకే వేర్వేరు గదులని ఎంచుకున్నారని అనుకుంటున్నారు. అయితే వాళ్ల మాటలకు చెక్ పడేలా సుర్భి జ్యోతి తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది..
also read:Ustaad Bhagath Singh: పవన్ అభిమానులకు శుభవార్త.. ఉస్తాద్ మూవీ నుండి అప్డేట్.!