BigTV English
Advertisement

Sanjay Dutt : బాంబ్ పేలుడు సంజ‌య్‌ద‌త్‌కి గాయాలు..

Sanjay Dutt : బాంబ్ పేలుడు సంజ‌య్‌ద‌త్‌కి గాయాలు..
Sanjay Dutt

Sanjay Dutt : బాలీవుడ్ నటుడు ఇప్పుడు సౌత్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోన్న వెర్స‌టైల్ యాక్ట‌ర్ సంజ‌య్‌ద‌త్‌కి షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. అదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న‌కు పెద్ద ప్ర‌మాదం త్ప‌పింద‌ని టాక్‌. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే, సంజ‌య్ ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో కేడీ సినిమా ఒక‌టి. అర్జున్ స‌ర్జా అందులో హీరోగా న‌టిస్తున్నారు. ప్రేమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా న‌టిస్తున్నారు.


ఇది ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమాకు సంబంధించిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను స్టంట్ మాస్ట‌ర్ ర‌వివ‌ర్మ నేతృత్వంలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో లొకేష‌న్‌లో ఉంచిన సినిమా బాంబ్ బ్లాస్ట్ జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సంజ‌య్ ద‌త్ చేతికి ముఖానికి గాయాల‌య్యాయి. ఆయ‌న్ని వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ఆయ‌న‌కు ప్రాథ‌మిక చికిత్స‌ను అందించారు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత కేడీ షూటింగ్‌ను ఆపేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్స్ కోరుకుంటున్నారు.

సంజ‌య్ ద‌త్ ద‌క్షిణాదిలో కె.జి.య‌ఫ్ సినిమాతో బాగా పాపుల‌ర్ అయ్యారు. ఆ సినిమాలో అధీరాగా ఆయ‌న చేసిన యాక్టింగ్ పీక్స్‌లో ఉంది. దీంతో సౌత్ మేక‌ర్స్ ఆయ‌న్ని ఇక్క‌డ న‌టింప చేయ‌టానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అదే క్ర‌మంలో కేడీ సినిమాలో న‌టించ‌టానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అలాగే పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రంలోనూ ఆయ‌న ప్ర‌భాస్ తాత‌య్య పాత్ర‌లో క‌నిపిస్తార‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. అలాగే మ‌రో క్రేజీ సౌతిండియా ప్రాజెక్ట్ లియోలో కూడా సంజ‌య్ ద‌త్ యాక్ట్ చేస్తున్నారు.


ఈ సినిమాలో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. లొకేష్ క‌న‌క‌రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఈ మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో సంజ‌య్ ద‌త్ న‌టించ‌టం అనేది సినిమాల‌కు ప్ల‌స్ పాయింట్‌గా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్‌గా వీటిని రిలీజ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ విష‌యంలో సంజు బాబా ఉండ‌టం ప్ల‌స్ అవుతుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×