BigTV English

Akhanda 2 : బాలయ్యకు షాకిచ్చిన బోయపాటి.. అప్పుడే షూటింగ్ స్టార్ట్..

Akhanda 2 : బాలయ్యకు షాకిచ్చిన బోయపాటి.. అప్పుడే షూటింగ్ స్టార్ట్..

Akhanda 2 : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరి కాంభో నాలుగోసారి రిపీట్ కానుంది. గత ఏడాది చివర్లో వీరి కాంబోలో నాలుగో సినిమా ‘అఖండ 2’ ప్రారంభం అయ్యింది. కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న బాలకృష్ణ ప్రస్తుతం ‘డాకు మహారాజ్‌’ సినిమా ప్రమోషన్‌ లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి రాబోతున్న ఆ సినిమా ఈవెంట్స్‌తో పాటు ప్రత్యేక మీడియా సమావేశాల్లో బాలయ్య పాల్గొంటు మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నాడు.. అటు టాక్ షాతో సెలెబ్రేటీలను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉన్నాడు.


బాలయ్య డాకు మహారాజ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నా బోయపాటి సినిమాను పక్కన పెట్టలేదు. గత కొన్ని రోజులుగా భారీ సెట్టింగ్స్‌ వేయిస్తున్న బోయపాటి శ్రీను సంక్రాంతి తర్వాత కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేపట్టబోతున్నారు. ఆ షెడ్యూల్‌లో బాలకృష్ణ పాల్గొనబోడు. విలన్‌తో పాటు కీలక పాత్రల్లో నటించే నటీనటులు మాత్రమే ఆ షెడ్యూల్‌లో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక రెండు వారాల పాటు సినిమాలకు దూరంగా విశ్రాంతి తీసుకొనున్నారని సమాచారం.. ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రారంభం కాబోతున్న షెడ్యూల్‌ లో పాల్గొంటారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తుంది.

సనాతన ధర్మ గురించి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సనాతన ధర్మం పై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా అఖండ 2 లో కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అఖండ లో అఘోర పాత్ర లో కనిపించడం ద్వారా సర్‌ప్రైజ్ చేసిన బాలయ్య మరోసారి అదే పాత్రలో సర్ ప్రైజ్ చెయ్యనున్నాడు. ఈ ఏడాదిలోనే దసరా కానుకగా సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఐదు సినిమాగా రాబోతుంది. అందుకే అఖండ 2 లో తమన్‌ అంతకు మించి అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇస్తాడేమో చూడాలి.. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంటే డబుల్‌ హ్యాట్రిక్ కానుంది. దాంతో అఖండ 2 కి మరింత అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. మరి బోయపాటి శ్రీను ఎలాంటి స్టోరీ తో ఫ్యాన్స్ ను మెప్పిస్తాడో చూడాలి.. ఏది ఏమైనా ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన అఖండ మూవీ స్టోరికి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.


Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×