Nepal EarthQuake: దేవ భూమిగా పేరుగాంచిన నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. లుబుచేకు 93 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.1గా నమోదైంది.
నేపాల్‌లో మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో భారీగా భూకంపం సంభవించింది. భూమి భారీగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పలు చోట్ల వస్తువులు కిందపడ్డాయి. చాలా ఇళ్లు బీటలు వారాయి. తీవ్రత గురించి అధికారులు ఇప్పుడిప్పుడే అంచనాకు వస్తున్నారు.
నేపాల్ నుంచి వివిధ వార్తల సంస్థల ద్వారా అందుతున్న సమాచారం మేరకు.. భూకంపంలో ఇప్పటి వరకు కనీసం 53 మంది మృతి చెందారు. మరో 62 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నాయి. తొలుత వచ్చిన భూకంపం తర్వాత టిబెట్ రీజియన్‌లో మళ్లీ రెండు సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే వీటి తీవ్రత 4.7, 4.9గా రిక్టర్ స్కేల్‌పై నమోదయ్యాయి.
హిమాలయ ప్రాంతం కావడంతో భూకంపం వల్ల అధికంగా డ్యామేజ్ జరిగిన ప్రాంతానికి అధికారులు వెళ్లలేకపోతున్నారు. రోడ్లు డ్యామేజ్‌తో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు కమ్యూనికేషన్ వ్యవస్థ సైతం దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ALSO READ: కెనడాలో ఏం జరుగుతోంది? ప్రధాని రాజీనామా వెనుక కారణం ఏమిటీ? అసలేం జరుగుతోంది?
పదేళ్ల కిందట 2015లో వచ్చిన భూకంపం నుంచి ఇప్పుడిప్పుడు అక్కడి ప్రజలు తేరుకుంటున్నారు. ఆనాడు జరిగిన ఘటనలో దాదాపు 9000 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. గాయపడిన వారి సంఖ్య 22 వేలు. అప్పట్లో రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదయ్యింది.
ఐదు దాటితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఏడు వరకు నమోదు కావడంతో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నేపాల్ అధికారుల మాట. రోడ్లు, కమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిన్న భూప్రకంపనలు సహజంగా అక్కడ వస్తుంటాయి. ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై పడింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం.
నేపాల్‌లో భారీ భూకంపం
నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు
భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించిన ఈ భూకంప ప్రభావం
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి… pic.twitter.com/F5NtfCezgQ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025