Satyabhama Today Episode January 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్య న్యాయం చెయ్యాలంటే అధికారం ఉండాలని ఏం జరిగినా వెనక్కి తగ్గను అని అనుకుంటుంది. ఇక నామినేషన్ ఫామ్ లో సంతకాల కోసం పుట్టింటికి వచ్చిన సత్యకు చుక్కెదురు అవుతుంది. మీ అత్తింటి వాళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు ఇలా మొండిగా ఉండటం బాగోలేదని చెబుతారు. ఇక విశాలాక్షితో సహా ఇంట్లో వాళ్ళందరూ సత్యకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ముందు నీ భర్తని నీ మామని నీ దారికి తెచ్చుకో ఆ తర్వాత మేము నీ దారికొస్తామని విషయాలు అంటుంది. విశ్వనాథం కూడా భార్య మాటను కాదనలేక పోతాడు. అటు హర్ష కూడా చెల్లెలుకు సపోర్ట్ చేయడానికి ముందుకు రాడు. నందిని మాత్రం నా సపోర్ట్ నీకే వదినా ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. ఇంట్లో ఎవరు ముందుకు రాకపోవడంతో నిరాశపడుతుంది. నాకు ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా నా పుట్టింటి వాళ్ళు ఉన్నారని ధైర్యంతో నేను ముందుకు సాగేదాన్ని కానీ ఇప్పుడు నా పుట్టింటి వాళ్ళు నన్ను వదిలేసారని బాధపడలో లేకపోతే ఆనందపడాలో అర్థం కావట్లేదు అని సత్య బాధపడుతుంది. క్రిష్ ఫ్రెండ్స్ మాటలు విని ఆలోచనలో పడతారు.. సంజయ్ బుట్టలో సంధ్య పడింది. అన్ని విషయాలను సంజయ్ కు చెబుతుంది. మహదేవయ్య సత్యను ఇన్సల్ట్ చేస్తాడు. నీ పుట్టిన రోజు చాలా పిరికోళ్ళు ఏమన్నా కూడా పారిపోతారు ఇక నువ్వు ఆశ వదులుకోవడం మంచిది అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్య ఎన్నిసార్లు బెదిరించినా బెదరకుండా సత్య ముందడుగు వేస్తుంది. నీ నామినేషన్స్ నుంచి తప్పుకోవాలంటే నువ్వు ప్రజలకు మేలు చేయాలి అలాగే నీ ప్రవర్తన మార్చుకోవాలని సత్య ఆఫర్ ఇస్తుంది కానీ మహదేవయ్య ఆ ఆఫర్ ను తిరస్కరిస్తాడు. ముందు ముందు నీకు ఇంకా కొన్ని ఎదురవుతాయి కోడలా అని వార్నింగ్ ఇస్తాడు. ఇక సత్యా బెడ్రూంలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. సత్య తనని హేళన చేస్తాడని ఏమి మాట్లాడుకున్నా ఉంటుంది. కానీ క్రిష్ మాత్రం సత్యను అడుగుతాడు. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదని సత్య అనగానే క్రిష్ బాధపడతాడు. ఇక ఈ గొడవ ఎక్కడికో వెళ్తుంది అని క్రిష్ బ్రేక్ చేసి రొమాన్స్ లోకి దిగుతారు. ఇక ఉదయం లేవగానే మహదేవయ్య ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటాడు. భైరవిని పిలిచి మటన్ బిర్యానీ మటన్ కర్రీ ఇలా ఐటమ్స్ అన్ని చేసి పెట్టు అనేసి అంటాడు. మహదేవ ఏమన్నా కూడా భైరవి మాత్రం అన్ని నా పెద్ద కొడుకు చాలా ఇష్టం అని అంటుంది. అక్కడ జైల్లో చిప్పకూడు తింటుంటే ఇక్కడ మీరు మాత్రం బిర్యానీలు కావాలని ఎద్దేవ చేస్తుంది. వాసన వస్తే వాడే వస్తాడులే అనేసి మహదేవయ్య అంటాడు.
అప్పుడే రుద్ర ఇంటికి వస్తాడు. రుద్రను చూసి భైరవి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. ఇక రేణుక క్రిష్ సత్యాలు టెన్షన్ పడుతూ ఉంటారు. నా మనసులోని మాట అర్థం చేసుకున్నావు పెనిమిటి నా కొడుకుని మళ్ళీ తీసుకొచ్చావని భైరవి మహదేవయ్య పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. ఇన్నాళ్లు గుర్తొచ్చిందా బాపు అని రుద్ర అడుగుతాడు. రుద్ర ఏం చేస్తాడని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నందిని ఇంటికి వస్తుంది.. ఏంటన్నా జైలుకుడు బాగా పట్టినట్టుంది బాపు నీ మీద బెంగ పెట్టుకున్నాడా అప్పుడే ఇంటికి వచ్చేసావా అనేసి అడుగుతుంది. ఇక నందిని రుద్ర ఒక్క మాట కూడా పడకుండా అరుస్తాడు. నువ్వు మహదేవయ్య కొడుకువి అయితే నేను అదే మహదేవయ్య కూతుర్ని ఇద్దరిదీ సేమ్ బ్లడ్ అని నువ్వు ఎంత నువ్వెంత అని గొడవకు దిగుతారు.. అంత ఎందుకు వదిన నామినేషన్స్ కి మందు కావాలన్నావ్ కదా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళని అడుగుదాం రా వెళ్దాం అనేసి అడుగుతుంది. సత్య క్రిష్ కి చెప్పి వెళ్ళిపోతుంది. నామినేషన్స్ అంటుంది ఏంటి బాబు అనగానే మీ నాయనకి పోటీగా సత్య ఎన్నికల్లో దిగుతుంది అనేసి బైరవి అంటుంది. ఇక క్రిష్ టైంలో అన్నయ్య ఏదైనా గొడవ పెట్టుకుంటే చాలా పెద్ద ప్రమాదమే అవుతుంది నువ్వు తప్పు చేశావు బాబు ఈ టైంలో ఆన్లైన్ బయటికి తీసుకొచ్చి అనేసి అనగానే రుద్ర కోపంతో రగిలిపోతాడు.
ఇక సత్య నందినీలు సైన్ పెట్టడానికి ఊరంతా తిరుగుతారు. కానీ ఏ ఒక్కరు కూడా మహదేవయ్యకు భయపడి సంతకం చేయడానికి ముందుకు రారు. అప్పుడే నరసింహ సత్య వాళ్ళకి ఎదురవుతాడు. అటు రేణుక రుద్ర కు అన్నం పెడుతుంది రుద్ర రేణుక జైలుకు పంపించిందన్న కోపంతో కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక సత్యకు నరసింహ ఆఫర్ ఇస్తాడు. నీకు 10 మంది కాదు వందమంది నీ వెనకాల తీసుకొస్తాను నువ్వు నాతో చేతులు కలుపు అని అడుగుతాడు. అది క్రిష్ వింటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సత్యకు సపోర్ట్ పెరుగుతుంది.. సత్యను సపోర్ట్ చేస్తూ జయమ్మ నామినేషన్స్ లో సైన్ పెడుతుంది. ఇక క్రిష్ కూడా జయమ్మకు తోడుగా వస్తాడేమో చూడాలి..