BigTV English

Brahmaji: లైలా ఈవెంట్లో పృథ్వీదే తప్పు.. హీరో పై అలాంటి కామెంట్స్ చేసిన బ్రహ్మాజీ..!

Brahmaji: లైలా ఈవెంట్లో పృథ్వీదే తప్పు.. హీరో పై అలాంటి కామెంట్స్ చేసిన బ్రహ్మాజీ..!

Brahmaji:ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) తొలిసారి లేడీ గెటప్ లో నటిస్తున్న చిత్రం లైలా (Laila ).
రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వంలో సాహూ గారపాటి (Sahoo garapati) నిర్మాణ సారధ్యంలో ఫిబ్రవరి 14వ తేదీన ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల సెన్సార్ A సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా లేడీ గెటప్ లో హీరో విశ్వక్ సేన్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా తన అందంతో మెస్మరైజ్ చేశారు. ఇక ఇటీవల ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి (Chiranjeevi) కూడా విశ్వక్ సేన్ లేడీ గెటప్ పై ప్రశంసలు కురిపించారు అంటే.. విశ్వక్ ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయి నటించారో అర్థం చేసుకోవచ్చు.


లైలా సినిమా ఈవెంట్ లో రాజకీయ రచ్చ లేపిన పృథ్వీ..

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్, పాటలు, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అలాంటి సమయంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇందులో నటించిన 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ (Prudhvi Raj) చేసిన కామెంట్లు సినిమాను బాయ్ కాట్ వరకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా పృథ్వీ ఈ సినిమా ఈవెంట్ కి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడడంతో అందరూ విమర్శలు గుప్పించారు. వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని.. “సినిమాలో ఒక షాట్ లో ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే.. 150 అని అన్నారు. యాదృచ్ఛికంగా చివర్లో చూస్తే 11 మిగిలాయి” అంటూ ఇన్ డైరెక్ట్ గా వైసీపీ పార్టీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 సీట్లు సొంతం చేసుకొని ఘనవిజయం సాధించింది. ఇక 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలో కొనసాగుతున్న పృథ్వీ రాజ్ సినిమా వేదికను రాజకీయం చేసేశారు అని చాలామంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వైసీపీ అభిమానులు, అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు కూడా పృథ్వీ మాటలపై విమర్శలు గుప్పించారు.


ముమ్మాటికి పృథ్వీదే తప్పు – బ్రహ్మాజీ..

ఇలాంటి సమయంలో తాజాగా ప్రముఖ కమెడియన్ గా, సీనియర్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీ(Brahmaji ) కూడా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ గురించి మాట్లాడారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ.. “పృథ్వీ నూటికి నూరు శాతం తప్పు చేశారు. ఒక సినిమా ఈవెంట్ కు వెళ్లి రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా ఎలక్షన్స్ అయిపోయి పరిపాలన సవ్యంగా సాగుతున్న సమయంలో ఇలాంటి మాటలు అనవసరం. ముఖ్యంగా ఒక హీరో ఈవెంట్ కు వెళ్లి ఇలా రాజకీయ చర్చకు దారి తీయడం ఎంతవరకు కరెక్ట్.. పృథ్వీ తప్పు చేశాడు” అంటూ బ్రహ్మాజీ కూడా పృథ్వీదే తప్పు అంటూ తెలిపాడు. అలాగే హీరో విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ..” విశ్వక్ చాలా మంచి హీరో .ముఖ్యంగా తనకు పరిచయం ఉన్నా.. పరిచయం లేకపోయినా.. ఎవరైనా సరే తమ సినిమా ఈవెంట్ కి కానీ, ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి గానీ పిలిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోతారు. ఒకసారి మా సినిమా ఈవెంట్ కోసం ఏకంగా గంటన్నర కారులోనే ఎదురు చూశారు. ఆ తర్వాత ఈవెంట్ రేపు అని చెబితే పరవాలేదు రేపు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఆయన చూడడానికే మాస్ కానీ చాలా మంచి అబ్బాయి” అంటూ విశ్వక్ సేన్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం బ్రహ్మాజీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×