BigTV English

Anupam Kher: కెరీర్‌లో 544 సినిమా.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలీవుడ్ నటుడు..

Anupam Kher: కెరీర్‌లో 544 సినిమా.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలీవుడ్ నటుడు..

Anupam Kher: గత కొన్నేళ్లలో ఎంతోమంది బాలీవుడ్ సీనియర్ నటులు నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అలాంటి వారిలో అనుపమ ఖేర్ కూడా ఒకరు. ‘కార్తికేయ 2’ సినిమాలో అనుపమ్ ఖేర్ చేసిన పాత్రను ఎన్నేళ్లయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆయన క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అందుకే ఆ మూవీ తర్వాత మరెన్నో తెలుగు చిత్రాల్లో కూడా అనుపమ్ ఖేర్‌కు నటుడిగా అవకాశం లభించింది. ఇప్పుడు తన కెరీర్‌లో గుర్తుండిపోయే 544 సినిమాను ప్రభాస్‌తో కలిసి చేస్తున్నారు అనుపమ్ ఖేర్. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక్కసారిగా ఈ ఫోటో అంతటా వైరల్ అయిపోయింది.


స్వయంగా ప్రకటన

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో హను రాఘవపూడి మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు ‘ఫౌజీ’ (Fauji) అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ అయ్యింది. టైటిల్ ఇదే అని మేకర్స్ అదికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే ఈ టైటిల్‌పై సోషల్ మీడియాలో ఎడిట్స్ కూడా మొదలయ్యాయి. ఇక పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ‘ఫౌజీ’లో తాను ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు అనుపమ్ ఖేర్ స్వయంగా ప్రకటించారు.


అద్భుతమై కథ

‘ఇండియన్ సినిమాకు బాహుబలి, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్‌తో కలిసి నా 544వ సినిమా చేస్తున్నానని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా టాలెంటెడ్ హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ లాంటి అద్భుతమైన నిర్మాణ సంస్థ.. ఈ సినిమాను నిర్మిస్తోంది. నా మంచి స్నేహితుడు అయిన సుదీప్ ఛాటర్జీ దీనికి డీఓపీగా వ్యవహరిస్తున్నాడు. అద్భుతమైన కథ. ఇంతకంటే నాకు ఏం కావాలి’ అంటూ తన సంతోషాన్ని మొత్తం ఒక ట్వీట్ ద్వారా బయటపెట్టేశాడు అనుపమ్ ఖేర్. ఈ ట్వీట్‌లో తను ప్రభాస్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అందులో ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ అప్పుడే మురిసిపోతున్నారు.

Also Read: సెట్‌లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎలా ఉంటారంటే.. సీక్రెట్ బయటపెట్టిన నిధి అగర్వాల్

క్యాస్టింగ్‌పై నో క్లారిటీ

అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇదంతా వైరల్ అయ్యింది. ఈ మూవీతో ఇమాన్వి నటిగా ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురించి మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రభాస్, ఇమాన్వి తప్పా క్యాస్టింగ్ గురించి కూడా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇంతలోనే అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్త ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రాజా సాబ్’ కంటే ‘ఫౌజీ’ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారని అనడంలో ఆశ్చర్యం లేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×