Brahmaji: 2021 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది ‘పుష్ప2’. అల్లు అర్జున్(Allu Arjun)హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాకి సుకుమార్ (Sukumar)దర్శకత్వం వహించారు. సినిమా ప్రేమికులు ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలై మిక్స్డ్ టాక్ తో సౌత్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో ఇస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు స్టార్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.
పుష్ప 2 సినిమాపై బ్రహ్మాజీ కామెంట్స్..
బ్రహ్మాజీ.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “ఈ చిత్రానికి వస్తున్న రివ్యూలు, రేటింగ్స్ మాత్రం మీరు అసలు చూడకండి. వెళ్లి సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. అంతేకాకుండా స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇస్తారు” అంటూ చాలా గొప్పగా రాసుకొచ్చారు. మొత్తానికైతే బ్రహ్మాజీ ఇచ్చిన ఈ రివ్యూకి అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వరుస కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
సంధ్య థియేటర్లో విషాదం..
ఇదిలా ఉండగా మరొకవైపు డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షోలు వేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరగగా.. విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా, ఆమె కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై అల్లు అర్జున్ బాధ్యత వహించాలని పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.
అల్లు అర్జున్ టీం పై కేస్ ఫైల్..
ఇకపోతే సంధ్య థియేటర్లో జరిగిన విషాద ఘటన కారణంగా అటు అల్లు అర్జున్ టీం తో పాటు ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పై కేసు ఫైల్ అయ్యింది. ముఖ్యంగా సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీనికి కచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందే అనే నేపథ్యంలో పలువురు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా.. వీరి పై కేసు ఫైల్ అయినట్లు సమాచారం. అలాగే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వస్తున్న విషయాన్ని ఆయన అభిమానులు పోలీసులకు సరైన సమయానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని, ముఖ్యంగా అక్కడి ఆడియన్స్ను అదుపు చేయలేకపోవడం వల్ల ఈ విషాదం చోటు చేసుకుందని, బాధ్యతారహితంగా ప్రవర్తించిన అల్లు అర్జున్ టీం పై కేసు ఫైల్ అయింది. దీనిపై అల్లు అర్జున్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
Standing Ovation 🙏🏼@alluarjun ❤️🤗
No reviews.. No ratings .. just go n experience goosebumps 💥🔥#Pushpa2TheRule— Brahmaji (@actorbrahmaji) December 5, 2024