Sobhita Wedding Saree Cost: పెళ్లి.. ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో జరిగే అద్భుతమైన ఘట్టం. ఆరోజు కోసం ఎంతోమంది అమ్మాయిలు తమ యుక్తవయస్సుకు వచ్చినప్పటి నుంచే ఎదురుచూస్తూ ఉంటారు. తమ పెళ్లి రోజున ఎంతో స్పెషల్ గా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. పెళ్లిలో అందరి చూపు వధువు మీదనే ఉంటుంది కాబట్టి.. ఆమె అలంకరణ, నగలు, దుస్తుల గురించే కొన్నిరోజులు మాట్లాడుకుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతం ఏమి కాదు.
స్టార్ హీరోయిన్స్.. తమ పెళ్లిల్లో ధరించే దుస్తులు, ఆభరణాలు తమకు నచ్చిన్నట్లుగానే కాకుండాజీవితాంతం గుర్తుండిపోయే విధంగా తగ్గట్టు డిజైన్ చేయించుకుంటారు. అప్పట్లో సమంత కూడా తన పెళ్లి దుస్తులను అలానే డిజైన్ చేయించుకుంది. తన పెళ్లి చీరపై .. చైతో ఉన్న జ్ఞాపకాలను అన్నింటిని ప్రింట్ చేయించుకుంది. అప్పట్లో ఈ చీర సెన్సేషన్ సృష్టించింది. ఇక మొన్నటికి మొన్న నయనతార సైతం తన పెళ్లి చీరను.. ఒక అందమైన జ్ఞాపకంగా మలుచుకుంది. తన భర్త విగ్నేష్ కు నచ్చిన కలర్ తో మహారాణి లుక్ వచ్చేలా డిజైన్ చేయించుకుంది.
Akkineni Nagarjuna: ఇది నా కొడుకు పెళ్లి వేడుక మాత్రమే కాదు.. ఎమోషనల్ అయిన నాగ్
ఇక ఇప్పుడు అక్కినేని కొత్త కోడలు శోభితా సైతం తన పెళ్లి దుస్తుల్లో ఎంతో వైవిధ్యం చూపించింది. గతరాత్రి అక్కినేని నాగచైతన్య, శోభితాల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ జనరేషన్ లో పెళ్లిళ్లు అంటే.. వధువులు మోడ్రన్ లెహంగాలు ధరిస్తున్నారు. కానీ, శోభితా మాత్రం ఆధునిక పద్దతులను పక్కన పెట్టి అచ్చ తెలుగు సంప్రదాయాలకు తగ్గట్టు రెడీ అయ్యింది. కేవలం పెళ్ళిలో మాత్రమే కాదు.. మొదటి నుంచి కూడా శోభితా ఆ తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూనే వచ్చింది.
పసుపు దంచడం దగ్గరనుంచి పెళ్లి వరకు కూడా అక్కినేని కోడలు తెలుగుదనం ఉట్టిపడేలానే కనిపించింది. నిన్న పెళ్ళిలో కూడా శోభితా.. ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా డిజైన్ చేసిన కంజీవరం సిల్క్ చీరను ధరించింది. బంగారు రంగు వర్ణంలో మెరిసిపోతున్న ఆ పట్టుచీరపై.. మరింత వన్నెతెచ్చేలా ఏడువారాల నగలను అలకరించుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ నగలన్నీ కూడా శోభితా అమ్మ, అమ్మమ్మల నగలని తెలుస్తోంది.
Fahadh Faasil: పుష్ప వలన నాకు వచ్చింది లేదు.. పోయింది లేదు..
పూర్వం ఎక్కువగా వాడే.. కంఠహారాలు, కంకణాలు, మాతపట్టి, బుల్లకి, సూర్యచంద్రుల మోటిఫ్‌లు, వంకీలు, కమర్ బాండ్ మరియు బాజుబాండ్ లను ధరించి.. అచ్చ తెలుగు వధువులా మెరిసిపోయింది. ఇక తలంబ్రాల చీర కూడా ఆమె ఎంతో అద్భుతంగా డిజైన్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన సాధారణ తెల్లటి ఖాదీ చీరను ధరించి, దానిపై నిండుగా ఆభరణాలను ధరించింది.
ఇక శోభితా పెళ్లి ఫోటోలు చూసిన వారందరూ కూడా ఆ చీర, నగల ధర ఎంత అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం శోభితా పెళ్లి చీర.. 30,000 నుండి 2.15 లక్షలోపు ఉంటుందని అంటున్నారు. నీతూ లుల్లా ఏమి మాములు డిజైనర్ కాదు. కచ్చితంగా ఆ చీర లక్ష పైనే ఉంటుందని టాక్ నడుస్తోంది.
ఇక పొందూరు ఖాదీ చీర.. పదివేలకు పైనే ఉంటుందని సమాచారం. పెళ్లి చీరలకు, నగలకు ఎక్కువ డబ్బులు పెట్టకుండా.. అక్కినేని కోడలు ఎంతో తెలుగుదనం ఉట్టిపడేలా.. కనిపించడం చాలా విశేషమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.