HBD Brahmanandam : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం (Brahmanandam) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒక తెలుగులోనే కాకుండా ఇండియా మొత్తం మీద స్టార్ హీరోలతో సమానంగా భారీ పాపులారిటీ అందుకున్న కమెడియన్ గా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా కొంత మంది స్టార్ హీరోల కంటే ఎక్కువగా పారితోషకం తీసుకున్న నటుడు కూడా ఈయనే. అంతేకాదు దేశం లోని సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత ఖరీదైన కమిడియన్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. ఇక సినిమాలలో సుమారుగా 1200 కు పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి మేరకు ఆయన ఆస్తులు కూడబెట్టారో ఇప్పుడు చూద్దాం.
ప్రతి రూపాయి కూడా రియల్ ఎస్టేట్‌లోనే…
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా సంపాదించిన ప్రతి రూపాయిని కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టి, నేడు వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యారు. ఒక సినిమాలో నటించాలంటే రోజుకు 1 లక్ష నుండి 4 లక్షల వరకు పారితోషకం తీసుకునే బ్రహ్మానందం, ఒక సినిమాకు కోటి రూపాయలకు పైగానే పారితోషకం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో జంధ్యాలతో పాటు రామానాయుడు (Ramanaidu), చిరంజీవి (Chiranjeevi) వంటి వారు బాగా ప్రోత్సహించడం వల్లే స్టార్ హీరోలతో సమానంగా ఎదిగారు. ముఖ్యంగా సినిమాలో బ్రహ్మానందం కనబడ్డాడు అంటే ప్రేక్షకుల నుంచి కచ్చితంగా ఈలలు వస్తాయనటంలో సందేహం లేదు. అందుకే బ్రహ్మీ అని అభిమానులు కూడా ఈయనను ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు వయసు మీద పడడంతో ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలు అడపాదడపా మాత్రమే చేస్తున్నారు.
బ్రహ్మానందం ఆస్తుల విలువ..
సినిమాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టిన బ్రహ్మానందం.. సుమారుగా 800 కోట్లకు పైగా ఆస్తి కూడబెట్టినట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలి అంటే ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టలేదని చెప్పవచ్చు.
బ్రహ్మానందం కార్ కలెక్షన్..
ఇక బ్రహ్మానందం దగ్గర ఉన్న లగ్జరీ కార్ల విషయానికి వస్తే.. ఆడి ఆర్ 8, ఆడి క్యూ 7 , బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లతో పాటు అనేక కంపెనీల కార్లు ఈయన దగ్గర ఉన్నాయి.
బ్రహ్మానందం వారసులు..
ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే.. కమెడియన్ గా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాబాయి హోటల్, రంగమార్తాండ వంటి చిత్రాలలో ఆయనలోని మరో నటన కోణం కూడా ఆవిష్కృతమైంది. ఎటువంటి పాత్రలోనైనా సరే అవలీలగా చేయగలను అని బ్రహ్మానందం నిరూపించారు. బ్రహ్మానందం కి ఇద్దరు కొడుకులు అయితే.. పెద్దబ్బాయి గౌతమ్ ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమా చేసి బిజినెస్ రంగం వైపు అడుగులు వేసిన ఆయన ఇప్పుడు తండ్రితో కలిసి సినిమా చేయబోతున్నారు. ఇక చిన్న కొడుకు డాక్టర్ కావడంతో ఇటీవలే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఇక బ్రహ్మానందం నటుడు మాత్రమే కాదు మంచి ఆర్టిస్టు కూడా.. ఆయన వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఎంత అద్భుతంగా గీస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏది ఏమైనా ఈయన లాంటి గొప్ప నటులు ఇండస్ట్రీకి దొరకడం నిజంగా ఇండస్ట్రీ అదృష్టం అని చెప్పవచ్చు.