Sanju Samson: ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా భారత జట్టు మొదటి రెండు టీ-20 లను గెలుచుకున్న విషయం తెలిసిందే. అనంతరం జరిగిన మూడవ టి-20 లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక జనవరి 31 శుక్రవారం రోజు జరిగిన నాలుగవ టి-20 ఉత్కంఠ భరిత పోరులో భారత జట్టు విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ లో గెలుపొంది భారత్ ఈ సిరీస్ ని కైవసం చేసుకుంది.
Also Read: Hardik Pandya: బలుపు అన్నారు కదరా… దుమ్ములేపి చూపించా !
ఇక ముంబై వేదికగా ఆదివారం రోజు చివరి టీ-20 జరగబోతోంది. ఈ మ్యాచ్ భారత జట్టుకు నామ మాత్రమే అయినప్పటికీ.. ఈ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు మాత్రం చివరి మ్యాచ్ లోనైనా గెలుపొంది ఆత్మవిశ్వాసంతో ఆ తర్వాత జరగబోయే 3 వన్డేల సిరీస్ లో బరిలోకి దిగాలని భావిస్తోంది. అయితే ఈ చివరి టీ-20 నుండి వికెట్ కీపర్ సంజూ శాంసన్ ని తొలగించే అవకాశం ఉంది. సంజూ శాంసన్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో కూడా అంతగా రాణించలేదు.
తొలి మ్యాచ్ లో కాస్త శుభారంభం అందించినా.. దానిని పెద్ద ఇన్నింగ్స్ గా మలచలేకపోయాడు. అనంతరం జరిగిన రెండవ మ్యాచ్ లో కూడా పూర్తిగా ప్లాప్ అయ్యాడు. గత నాలుగు ఇన్నింగ్స్ లలో సంజూ శాంసన్ 26, 5, 3, 1 పరుగులకే పరిమితం అయ్యాడు. ఈ సిరీస్ లో సంజూ శాంసన్ ఒకే రీతిలో నాలుగు సార్లు అవుట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నాలుగు సార్లు షార్ట్ బంతులను వెంటాడి మరీ వికెట్ సమర్పించుకున్నాడు.
తన దూకుడైన ఆటతో బౌలర్ల పై మెరుపు దాడి చేసే సంజూని.. ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బాల్స్ తో బోల్తా కొట్టిస్తున్నారు. తొలి మూడు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ బౌలర్ జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో పుట్ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్న శాంసన్.. నాలుగవ మ్యాచ్ లో సఖిబ్ ముహమ్మద్ బౌలింగ్ లో అదే పుట్ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. సంజూ ఈ సమస్యను అధిగమించకపోతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ విషయంలో విశ్లేషకులు అతడిని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా సంజూకి సలహా ఇచ్చాడు. సంజు పుల్ షాట్ ఆడుతున్న సమయంలో చేతులు ఓపెన్ అవ్వక బంతి కనెక్ట్ కావడంలేదని.. సంజు జరిగి ఆడకుండా లైన్ లో షాట్ ఆడాలని సూచించాడు. అయితే ఈ సలహాని సంజు పట్టించుకోకుండా మళ్ళీ నాలుగో మ్యాచ్ లో అదే తీరులో ఆడి మూల్యం చెల్లించుకున్నాడు.
Also Read: Kevin Pietersen: 12 మందితో ఆడి గెలిచారు.. ఇది మగతనం కాదు ?
బ్యాటింగ్ లో మాత్రమే కాకుండా 4వ మ్యాచ్ లో అటు కీపింగ్ లో కూడా ఒక స్టంపింగ్, ఒక క్యాచ్, ఓ రన్ అవుట్ మిస్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో సంజూ కీపింగ్ పై కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడు తీరు మార్చుకోవాలని.. వైఫల్యల పరంపర కొనసాగిస్తే అతడిని జట్టులోంచి తీసివేసే ప్రమాదం ఉందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.