Maha Khumb Mela Special Vande Bharat: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ (Prayagraj)లో మహా కుంభమేళా (Maha Kumbh Mela) అట్టహాసంగా జరుగతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక సంబరంలో పాల్గొనేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే కుంభమేళా కోసం భారతీయ రైల్వే ఏకంగా 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసింది. వీటిలో 3 వేలకు పైగా ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు.
కుంభమేళకు ప్రత్యేక వందేభారత్
మహా కుంభమేళాకు వస్తున్న భక్తులతో యూపీ పరిసర రాష్ట్రాలు అయిన మధ్యప్రదేశ్, బీహార్ లోనూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని అదనపు రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నార్తర్న్ రైల్వే(Northern Railways) సంస్థ కుంభమేళాకు వెళ్లే భక్తులుకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించేందుకు స్పెషల్ వందేభారత్ (Vande Bharat) రైలును నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైలును ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రైలు ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ మీదుగా వారణాసి వరకు వెళ్లనుంది.
ఇక 02252 నెంబర్ గల ప్రత్యేక వందేభారత్ రైలు న్యూ ఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయల్దేరుతుంది. 12 గంటలకు యూపీలోని ప్రయాగరాజ్ కు చేరుకుంటుంది. 2:20కి వారణాసి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదే రైలు (02251) తిరుగు ప్రయాణంలో భాగంగా వారణాసిలో 3:15కి బయల్దేరుతుంది. సాయంత్రం 5:20కి ప్రయాగరాజ్ కు చేరుకుంటుంది. ఇక రాత్రి 11:50కి ఢిల్లీ స్టేషన్ కు చేరుకోనున్నట్లు నార్తర్న్ రైల్వే ప్రకటించింది. వీకెండ్ లో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ రైలును ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీకెండ్ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
To ensure the convenience of devotees planning to visit Maha Kumbh this weekend, the Indian Railways has decided to run a Special Vande Bharat Express Service between New Delhi and Varanasi (via Prayagraj). The detailed train schedule is listed below: #MahaKumbh2025… pic.twitter.com/VqpMzdI2Lt
— Northern Railway (@RailwayNorthern) February 14, 2025
Read Also: కుంభమేళా రైళ్లపై వరుస దాడులు, నిందితులకు ఇక చుక్కలే!
దాదాపు 200 కి.మీ ట్రాఫిక్ జామ్
మహా కుంభమేళాకు భక్తులు పెద్ద సంఖ్యతో తరలి వస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. చాలా మంది రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో ప్రయాగరాజ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పాడుతోంది. గత వారాంతంలో ఏకంగా 200 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గత నెల 13న ప్రారంభమైన మహా కుంభమేళా.. శివరాత్రి వేళ ఫిబ్రవరి 26తో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సుమారు 50 నుంచి 60 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని భక్తుల విశ్వాసం.
Read Also: రైలును ధ్వంసం చేస్తే ఇండియాలో ఏ శిక్ష విధిస్తారు? ఆ దేశంలో ఏకంగా టాయిలెట్లు కడిగిస్తారు!