Actress Ramya Sri: ఇప్పుడంటే ఇండస్ట్రీ మీద చాలామందికి ఒక అవగాహన ఉంది. కానీ, ఒకప్పుడు సినిమాఇండస్ట్రీ అంటే చాలా చులకనగా చూసేవారు. ఏ ఇంట్లో ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీకి పంపించాలని అనుకునేవారు కాదు. అందులో సాంప్రాదాయాలను పాటించే కుటుంబాల్లోని వారు అమ్మాయిలను ఇండస్ట్రీలోకి పంపించాలని అస్సలు అనుకునేవారు కాదు. అందుకే చాలామంది.. ఇంట్లో చెప్పకుండా పారిపోయి ఇండస్ట్రీకి వచ్చేవారు. అలా వచ్చి సక్సెస్ అయితే ఓకే. అవ్వకపోతే వ్యభిచార కూపంలోకి నెట్టబడ్డారు. ఇండస్ట్రీ అంటే ఆషామాషీ విషయం కాదు. ఇలానే ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటి రమ్యశ్రీ.
రమ్యశ్రీ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు గుర్తుచేయలంటే.. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఎల్బీ శ్రీరామ్ ను ఒక మహిళ ఇంటికి రమ్మని పిలుస్తుంది. అక్కడ అతనితో బట్టలు విప్పించి.. కొడుకుకు బూస్ట్ తాగకపోతే ఈ అంకుల్ లా తయారవుతావ్ అని చెప్తుంది. ఆ కామెడీ సీన్ ను ఎవరు అంత త్వరగా మర్చిపోలేరు. అందులో నటించిన మహిళనే రమ్యశ్రీ. ఎక్కువగా బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్ లాంటి కమెడియన్స్ కు భార్యగా నటించి మెప్పించిన ఆమె కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో కూడా నటించింది. కన్నడలో హీరోయిన్ ఫా కూడా నటించింది.
ఇక రమ్యశ్రీ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనోగతాన్ని బయటపెట్టింది. అసలు తను ఇండస్ట్రీకి ఎలా వచ్చింది.. ? ప్రేమ, పెళ్లి, విడాకులు.. అన్నింటి గురించి మనసువిప్పి మాట్లాడింది. ” మా ఫ్యామిలీస్ లో అమ్మాయిలకు త్వరగా పెళ్లిళ్లు చేస్తారు. ఇంట్లో మామయ్యలకు ఇచ్చి పెళ్లిళ్లు చేసేవారు. నేను మా గ్రాండ్ మా ఇంట్లో ఉండి.. కోడూరు వెళ్లి చదువుకొనేదాన్ని. ఆరోజుల్లోనే మాకు బైక్స్, అంబాసిడర్ కార్లు ఉండేవి. మా ఇళ్లల్లో అమ్మాయిలను బయటకు పంపించేవారు కాదు. ఇంతవరకు చదివారా..? ఇక చాలు ఆపేద్దాం అనుకునేవారు. నేను 7 కిలోమీటర్లు వెళ్లి చదువుకొని మళ్లీ తిరిగివచ్చేదాన్ని.
Divyabharathi: సుడిగాలి సుధీర్ హీరోయిన్.. అద్దం ముందు వాటిని చూపిస్తూ.. దేవుడా
ఇక ఆ సమయంలో ఇంకెందుకు చదువు అని చెప్పి 13 ఏళ్ళకే నాకు మా మేనమామనే ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తరువాత కూడా నేను చదువుకున్నాను. ఇప్పటికీ ఆ వ్యక్తిని నేను దేవుడిగా భావిస్తాను. నా ఆలోచనలకు అంత మర్యాద ఇస్తాడు. నాకు పెళ్లి అయ్యిన 5 ఇయర్స్ కు అంటే నా 18 వ ఏట నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇంట్లో చెప్పకుండా పారిపోయి హైదరాబాద్ వచ్చేసాను. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ నువ్వు చాలా అందంగా ఉంటావ్.. సినిమాల్లోకి వెళ్లు.. హీరోయిన్ అవుతావు.. విమానాల్లో తిరుగుతావ్.. విజయశాంతి నీకన్నా అందంగా ఉండదు.. నువ్వు వెళ్లు అని చెప్పేవారు.
నేను ఇంటిదగ్గర నుంచి వచ్చేటప్పుడు డబ్బు ఏమీ దొంగతనం చేసి తీసుకురాలేదు. నా ఒంటిమీద బంగారం ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చి ట్రైన్ ఎక్కి నా ఫ్రెండ్ ను హెల్ప్ అడిగితే.. ఆమె వేరొక ఫ్రెండ్ ను హెల్ప్ అడిగితే .. అతను టీవీ9 రవిప్రకాష్ వద్దకు నన్ను పంపించారు. ఒక 3 రోజులు నేను వాళ్ళింట్లో ఉన్నాను. ఆయనే నన్ను రామానాయుడు స్టూడియోస్ కు తీసుకెళ్లి తీసుకొచ్చారు. ఆ తరువాత మళ్లీ నన్ను ఇంటికి పంపించేశారు. రవిప్రకాష్ పేరెంట్స్ చాలా దెబ్బలు ఆడేవారు. ఆడపిల్ల.. మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఇక్కడ ఎందుకు.. ఇంటికి పంపించు అని చెప్పేవారు.
ఖడ్గం సినిమాలో సంగీతలా అన్ని కష్టాలు పడకపోయినా.. కృష్ణవంశీ చూపించింది నిజం. ఎంతోమంది స్టార్స్ ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ నేను కూడా ఎదుర్కొన్నాను. అప్పుడు వారికి నేను ఒకటే మాట చెప్పేదాన్ని.. ఎందుకండీ నేనే.. నాకన్నా అందగత్తెలు బయట తక్కువ ధరకే దొరుకుతున్నారు. నా రెమ్యూనరేషన్ తగ్గించుకొని.. వారిదగ్గరకు వెళ్లండి అని చెప్పేదాన్ని. అలా కోరుకున్న ప్రియుడు సినిమాతో ఛాన్స్ వచ్చింది. ఆ తరువాత చాలా సినిమాలు చేశాను.
భర్తను వదిలేసి వచ్చినా నేను వేరే ట్రాక్ లోకి వెళ్ళలేదు. ప్రేమ, పెళ్లి అని ఎవరితోనూ కమిట్ అవ్వలేదు. ఇప్పటికీ నా భర్త కూడా వేరొకరిని పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ అలాగే ఉన్నాం ఇద్దరం. నన్ను ఆయన కూతురుగా చూస్తారు. ఆ కేరింగ్ నాకు బాగా నచ్చుతుంది. రెండేళ్ల క్రితం ఆయన మరణించారు. మనిషికి మనిషికి మధ్య ఒక బ్యాడ్ లేనప్పుడు.. ఒక మనిషిని మానసికంగా మర్యాద ఇచ్చినప్పుడు ఎందుకు గౌరవించం..? ఆయన అంటే నాకు ఎంతో గౌరవం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.