Brahmanandam:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం (Brahmanandam) స్టార్ డైరెక్టర్ కి దగ్గర బంధువు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఎవరో కాదు శేఖర్ కమ్ముల(Sekhar Kammula). ఈ డైరెక్టర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన, ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో మంచి క్లాసిక్ సినిమాలను అందించి, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక చివరిగా నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai pallavi)తో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల.. ప్రస్తుతం నాగార్జున (Nagarjuna), ధనుష్(Dhanush )హీరోలుగా ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నారు.
బ్రహ్మానందం భార్య మేనల్లుడే శేఖర్ కమ్ముల..
ఇక బ్రహ్మానందంకి, శేఖర్ కమ్మలాకి మధ్య ఉన్న రిలేషన్ తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఈ విషయం తెలియదే అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉండడం గమనార్హం . తాజాగా బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్(Raja Gautham) తాత మనవళ్లుగా నటిస్తున్న బ్రహ్మ ఆనందం అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ విషయాన్ని బ్రహ్మానందం బయటకు చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల కెరియర్ స్టార్టింగ్ లో గోదావరి సినిమా కథ రాజా గౌతమ్ కి చెప్పినప్పుడు, అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టు లా ఉందని బ్రహ్మానందం కాదన్నారట. ఇక ఈ విషయాన్ని ఆయన వెల్లడిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ములని నేను కమ్ముల శేఖర్ అని పిలుస్తాను. ఎందుకంటే ఆయన నా భార్య మేనల్లుడు. అయితే అది వేరే విషయం అంటూ ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు బ్రహ్మానందం. మొత్తానికైతే బ్రహ్మానందం సతీమణి మేనల్లుడే ఈ శేఖర్ కమ్ముల అని అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రీ ఎంట్రీ ఇస్తున్న బ్రహ్మానందం పెద్దకొడుకు..
బ్రహ్మానందం ఆయన పెద్ద కొడుకు రాజా గౌతమ్ తాజాగా నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ సినిమాను రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈయన తెలుగులో మధుర , ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకున్నారు. ఈయనకు మళ్ళీ ఈ సినిమాను నిర్మించే అవకాశం లభించింది. ఇకపోతే ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా మరో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే శేఖర్ కమ్ముల , బ్రహ్మానందం దగ్గర బంధువులు అని తెలిసి వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలో వస్తే బాగుంటుంది అని కూడా కోరుకుంటున్నారు.
బ్రహ్మానందం కెరియర్..
ఇక బ్రహ్మానందం విషయానికి వస్తే.. తన కెరియర్లో దాదాపు 1200కి పైగా చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న బ్రహ్మానందం అత్యధిక చిత్రాలలో నటించిన కమెడియన్ గా గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకున్నారు. పెద్ద కొడుకు గౌతమ్ గతంలో పల్లకిలో పెళ్లికూతురు సినిమా చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై.. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.