Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సాయుధ బలగాలు భారీ ఎన్ కౌంటర్ చేపట్టాయి. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్స్ జరుగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ దక్షిణ బస్టర్ ప్రాంత అడవుల్లో DRG, కోబ్రా, CRPF బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ లో ఈ మూడు జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. దీంతో ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ ఎన్ కౌంటర్ ను బస్తర్ ఐజి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. ఉదయం 9 గంటలకు మెుదలైన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఘటనా స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ : ఆ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సై!