Curd For Pigmentation: పిగ్మెంటేషన్ అనేది ఒక సాధారణ చర్మ సమస్య. ఇది తరచుగా సూర్యకాంతి, వయస్సు పెరగడం, హార్మోన్ల అసమతుల్యత , సరైన చర్మ సంరక్షణ లేకపోవడం వల్ల వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి పెరుగు ఒక సహజమైన , ప్రభావ వంతమైన నివారణ. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో ఉపయోగపడుతుంది.
ఇది మచ్చలను తగ్గించడంతో పాటు, చర్మాన్ని లోతుగా పోషించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖంపై పిగ్మెంటేషన్ తొలగించడానికి కొన్ని హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. పెరుగును పిగ్మెంటేషన్ తొలగించడానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1.పెరుగు, తేనె ఫేస్ ప్యాక్ :
ముందుగా 2 టీస్పూన్ల పెరుగులో 1 టీస్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద సమానంగా అప్లై చేయండి. తర్వాత దీనిని 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా చేస్తాయి. అంతే కాకుండా పెరుగు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
2. పెరుగు , శనగపిండి ప్యాక్ :
ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడానికి, ముందుగా 1 చెంచా శనగపిండిని 2 చెంచాల పెరుగులో కలపండి. దానికి చిటికెడు పసుపు వేసి మందపాటి పేస్ట్ లా తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి.
ఈ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది , అంతే కాకుండా మచ్చలను కూడా తగ్గిస్తుంది. శనగపిండి చర్మపు రంగును మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.
3. పెరుగు, నిమ్మకాయ ఫేస్ ప్యాక్ :
2 టీస్పూన్ల పెరుగులో అర టీస్పూన్ నిమ్మరసం కలపండి. దీన్ని నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి.
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు , నిమ్మకాయ మిశ్రమం చర్మాన్ని సహజంగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ప్రకాశవంతం చేస్తుంది.
పెరుగులో తేనె కలిపి వారం రోజులు ముఖానికి అప్లై చేయండి. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో ఒక టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతే కాకుండా మృదువుగా మారుస్తుంది.
మీరు మచ్చలతో ఇబ్బంది పడుతుంటే వాటిని తొలగించడానికి నిమ్మకాయ, పెరుగుతో, తేనెతో చేసిన మిశ్రమాన్ని ఉపయోగించండి. దీనికోసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగులో అర టీస్పూన్ నిమ్మరసం, కాస్త తేనె కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయాలి.
Also Read: కొబ్బరి నూనెలో ఈ 3 కలిపి వాడితే.. జుట్టు అస్సలు రాలదు
కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు:
ఎల్లప్పుడూ తాజా పెరుగును మాత్రమే వాడండి.
సున్నితమైన చర్మం ఉన్నవారు ఏదైనా ప్యాక్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ లను వారానికి 2-3 సార్లు ఉపయోగించండి. క్రమం తప్పకుండా వాడటం వల్ల ఫలితాలు కనిపిస్తాయి.
పెరుగు వాడిన తర్వాత ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.