BigTV English

BSS10: బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే.. కొత్త సినిమా గ్లింప్స్ రెడీ

BSS10: బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే.. కొత్త సినిమా గ్లింప్స్ రెడీ

BSS10: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం చూస్తున్నాడు. టాలీవుడ్‌లో హిట్లు లేక ఇటీవల బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. అక్కడ కూడా ఆశించిన ఫలితం లేకపోయింది. హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్‌తో ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా కూడా పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక టాలీవుడ్‌లోనే మంచి కంబ్యాక్ ఇద్దామని ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ. ఇప్పుడు అతడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘#BSS10’ వర్కింగ్ టైటిల్‌తో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీస్తున్నాడు. ఈ డైరెక్టర్ పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.


అయితే ఈ సినిమా 2023 జూన్‌లోనే పూజ కార్యక్రమాలు జరుపుకుంది. స్క్రిప్ట్‌లో కొన్ని చేంజెస్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. బెల్లంకొండ శ్రీను పదో సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.

అయితే ఇంతకు ముందే ఈ హీరో కవచం, రాక్షసుడు అనే సినిమాల్లో పోలీస్‌గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మూడోసారి అదే రోల్‌ని ప్లే చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. నేడు బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా టైటిల్ & ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని మధ్యాహ్నం 1.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ఈ సినిమా అయినా.. బెల్లంకొండ కెరీర్‌ని మారుస్తుందా? లేదా అనేది చూడాలి.


Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×