BigTV English

TPCC Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ సమావేశం.. లోక్ సభ ఎన్నికలపై చర్చ

TPCC Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ సమావేశం.. లోక్ సభ ఎన్నికలపై చర్చ
Political news in telangana

TPCC Meeting update(Political news in telangana):

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షితోపాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నామినెటెడ్‌ పోస్టుల భర్తీ, లోక్‌సభ ఎన్నికలపై చర్చించనున్నారు.


త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ లోక్‌సభ సీట్లపై కన్నేసింది కాంగ్రెస్‌. గత ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న హస్తం.. ఈసారి 17 సీట్లను సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ఇవాళ జరిగే టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణతో పాటు ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దీనిపై నివేదకను రూపొందించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 4న ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సమర్పించనున్నారు. కాగా.. సీఎంగా రేవంత్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగుతున్న తొలి పార్టీ సమావేశంకావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×