BigTV English

Glenn Maxwell : అరే.. ఇలా కూడా ఆడొచ్చా.. కొత్త షాట్ పరిచయం చేసిన మ్యాక్స్‌వెల్..

Glenn Maxwell : అరే.. ఇలా కూడా ఆడొచ్చా.. కొత్త షాట్ పరిచయం చేసిన మ్యాక్స్‌వెల్..

Glenn Maxwell : మన తెలుగు సినిమాల్లో ఒక పాపులర్ డైలాగ్ ఉంటుంది. హీరోని విలన్లు చితక్కొట్టేస్తుంటారు. అప్పుడు తను అంటాడన్నమాట.. ‘ఒరేయ్.. చంపేస్తే ఒక్కసారే చంపేయండ్రా.. నేనుగానీ బతికానంటే మాత్రం.. మీలో ఒక్కడు కూడా మిగలడు’ ఈ డైలాగ్ మ్యాక్స్ వెల్ కి సరిగ్గా సరిపోతుంది.


ఆస్ట్రేలియా క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు మ్యాక్స్ వెల్.. తను క్రీజులోకి వచ్చాక అవుట్ చేస్తే త్వరగా అవుట్ చేసేయాలి. లేదంటే మాత్రం ఆరోజు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఆ జట్టుకి సింహస్వప్నంగా నిలుస్తాడు. ఎన్నేళ్లయినా వారు ఆ మ్యాచ్ ని, ఆ కొట్టుడుని మరిచిపోలేరు. వారికి కలలోకి కూడా వచ్చి భయపెడుతుంటాడు.

అందుకు తాజా ఉదాహరణ వన్డే వరల్డ్ కప్ 2023లో ఆప్గనిస్తాన్ పై చేసిన డబుల్ సెంచరీ. కాలు నొప్పి పెట్టినా కుంటుతూనే చితక్కొట్టేశాడు. అటు తర్వాత భారత్ తో జరిగిన టీ 20 సిరీస్ లో కూడా సెంచరీ చేసి బెంబేలెత్తించాడు. జట్టుని గెలిపించాడు.


అలాంటివాడు ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ లో ఒక సరికొత్త షాట్ కొట్టి క్రికెట్ పండితులను సంభ్రమాశ్చర్యాలలో నింపేశాడు. ‘మ్యాక్సీ, ఈ షాట్ ని ఇలా కూడా కొట్టొచ్చా’.. అని అప్పుడే నెట్టింట కామెంట్లు మొదలయ్యాయి. అంతేకాదు ‘మ్యాక్సీ.. నువ్వు ఇలా ఆడితే బౌలర్లు ఏమైపోతారు?’ అని సరదాగా ప్రశ్నిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్సీ వెరైటీ షాట్లతో అదరగొట్టాడు. వర్షం కారణంగా మ్యాచ్ ని 14 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ 14 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.

ఛేజింగ్ కి వచ్చిన మెల్ బోర్న్ స్టార్ట్స్ జట్టు 12.1 ఓవర్ లోనే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ జట్టు తరఫున ఆడిన మ్యాక్స్ వెల్ చేసినవి తక్కువ పరుగులే అయినా.. తను కొట్టిన ఒక షాట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ స్కూప్ షాట్ ఆడుతున్నట్టుగా బౌలర్‌ను నమ్మించాడు.  ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని, సెకన్ల వ్యవధిలో  స్లిప్ మీదుగా కొట్టి బౌండరీ సాధించాడు. అంటే నేల మీద నుంచి వెళుతున్న బాల్ ని బ్యాట్ తో కింద నుంచి గాల్లోకి లేపి కొట్టాడు. అంతే గ్రౌండ్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

వినూత్న షాట్లకు మాక్స్‌వెల్ మారుపేరని అందరికీ తెలిసిందే. 360 డిగ్రీల్లో క్రీజులో తిరుగుతూ బాల్ ని ఎలాగైనా బౌండరీ లేదా సిక్సర్ కి పంపించే మ్యాక్స్ వెల్ బ్యాట్ నుంచి మరో అద్భుత షాట్ వచ్చేసింది. ఆ  షాట్ ని తనే కనిపెట్టాడు కాబట్టి దానికి మ్యాక్స్ వెల్ షాట్ గా నామకరణం చేయవచ్చునని నెట్టింట అభిమానులు అప్పుడే సూచిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×