BigTV English

RC16 : ఏందయ్యా బుచ్చిబాబు నీ ప్లానింగ్..అన్ని ఇండస్ట్రీలను వాడేస్తున్నావే ..?

RC16 : ఏందయ్యా బుచ్చిబాబు నీ ప్లానింగ్..అన్ని ఇండస్ట్రీలను వాడేస్తున్నావే ..?

RC16 : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి RC16. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి ఈ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడో కొబ్బరికాయ కొట్టి ముహూర్తం షార్ట్ తీశారు. కానీ సెట్స్ మీదకు వెళ్లిందని ఎక్కడా అనౌన్స్ చెయ్యలేదు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల చడి చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు పోటీగా స్టార్స్ ను బుచ్చిబాబు దింపబోతున్నాడని ఓ వార్త వినిపిస్తుంది. అసలు మ్యాటరేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇటీవల శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.. ఆ టీజర్ మూవీ పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని, సంక్రాంతికి రాబోతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా మొత్తం అందరి అంచనాలను తారుమారు చేస్తుంది అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇక ఈ సినిమా మాట పక్కన పెడితే బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తున్నా సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతుంది. మొన్నటివరకు రామ్ చరణ్ లుక్ గురించి వార్తలు వినిపిస్తే ఇప్పుడు మరో వార్త ప్రచారంలో ఉంది.. ఈ సినిమా పై మొదటి నుంచే అంచనాలను పెంచేందుకు బుచ్చిబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.

ఇక రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు రూపొందించబోతున్న మూవీ ఒక స్పోర్ట్స్‌ డ్రామా అనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్‌ అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. కోడి రామ్మూర్తి నాయుడును రియల్‌ బాహుబలి అంటూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రామ్మూర్తి నాయుడు జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క సినిమాను తీశారు. మొదటి సినిమా ఉప్పెనతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ వసూళ్లు సాధించారు. మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందకున్న బుచ్చి బాబుపై నిర్మాతలకు చాలా నమ్మకం ఉంది.. అందుకే ఏది అడిగిన కాదనలేదు. అలాగే బడ్జెట్ విషయంలో కూడా వెనక్కి తగ్గేదేలే అని ఖర్చు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ మూవీలో హీరోయిన్ గా దేవర బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి తో పాటు కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌తో పాటు ఇంకా పలువురు స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్. మొత్తానికి అన్ని ఇండస్ట్రీలలోని స్టార్స్ ను ఈ మూవీ కోసం దించుతున్నారని సమాచారం.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×