AA22xA6 : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో అట్లీ ఒకరు. రాజా రాణి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అట్లీ మొదటి సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇప్పటివరకు అట్లీ తెరకెక్కించిన సినిమాల్లో ఒకటి కూడా డిజాస్టర్ లేదు అని అంటే అట్లీ టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ హీరోగా అట్లీ వరుసగా సినిమాలు చేసి సక్సెస్ సాధించాడు. విజయ్ లాంటి స్టార్ హీరోకి వరుస సక్సెస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం అట్లీ పేరు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో వినిపిస్తుంది అంటే దానికి కారణం జవాన్ సినిమాతో అట్లీ కొట్టిన సక్సెస్. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అట్లీ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ డైరెక్టర్ అయిపోయాడు.
అల్లు అర్జున్ తో సినిమా
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా తమిళ్ సినిమా అని కాకుండా అంతా పాన్ ఇండియా సినిమా అయిపోయింది. ఇక అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ సాధించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. అలానే పుష్ప టు కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్తో ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ చేస్తున్న మొదటి తెలుగు సినిమా ఇది. ఆల్రెడీ హిందీలో సక్సెస్ అందుకున్న అట్లీ తెలుగులో ఎంత సక్సెస్ కొడతాడో వేచి చూడాలి. అట్లీ తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమాను చేయనున్నారు.
Also Read : Good Bad Ugly Box: బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కలెక్షన్స్ వసులు చేసిన అజిత్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే??
భారీ బడ్జెట్ దిశగా
ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దాదాపు 200 కోట్లు ప్రొడక్షన్ కోసం కేటాయించనున్నారు. అలానే విఎఫ్ఎక్స్ కోసం 250 కోట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి అట్లీ 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ 175 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా 15% ప్రాఫిట్ షేర్ కూడా అల్లు అర్జున్ పొందుకొని ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. పుష్పతో వరల్డ్ వైడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో ఏ స్థాయి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారకంగా త్వరలో ప్రకటించనున్నారు.
Also Read : Tollywood: యంగ్ హీరోలు చేసిన ఆ జాన్రా సినిమాలు వర్కౌట్ కాలేదు