Viral News: అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్. పుట్టి పెరిగింది డెహ్రాడూన్. అన్నీ ఫేక్ సర్టిఫికేట్లు. బ్రిటన్ కు చెందిన ప్రముఖ కార్టియాక్ సర్జన్ గా చలామణి అవుతున్నాడు. విదేశీయుడిగా కనిపించేందకు జుట్టుకు గోల్డ్ కలర్ వేసుకునేవాడు. అచ్చం ఫారినర్ గా వ్యవహరించేవాడు. చివరకు పాపం పండింది. డాక్టర్ ఎన్ జాన్ కామ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. రీసెంట్ గా ఏడుగురు పేషెంట్ల చావుకు కారణం కావడంతో అసలు కథ బయటకు వచ్చింది. ఈ ఫేక్ డాక్టర్ ను పోలీసులు కటకటాల్లోకి పంపించారు.
అసలు విషయం ఏంటంటే?
నరేంద్ర ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకుని తనను తాను డాక్టర్ జాన్ కామ్ గా పరిచయం చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని ఓ ఆస్పత్రిలో కార్డియాక్ సర్జన్ గా జాయిన్ అయ్యాడు. ఇప్పటి వరకు 15 వేల గుండె ఆపరేషన్లు చేసినట్లుగా చెప్పుకున్నాఉ. రీసెంట్ గా ఆయన ఆపరేషన్ చేసిన వారిలో పలువురు చనిపోయారు. హాస్పిటల్ యాజమాన్యానికి ఆయన మీద డౌట్ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరిందని తెలియగానే డాక్టర్ కామ్ కాన్ పరారయ్యాడు. ఇతడిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టింది. చివరకు యూపీలోని ప్రయాగలో ఈ డెత్ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.
2 దశాబ్దాలుగా గుండె ఆపరేషన్లు
డాక్టర్ జాన్ కామ్ 2006 నుంచే డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది. అతడు 2006లోనే చత్తీస్ గఢ్ లోని ఓ హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేసి ఓ పేషెంట్ మృతికి కారణం అయ్యాడు. అప్పటి నుంచి గుండె ఆపరేషన్లు చేస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఆ రాష్ట్ర స్పీకర్ శుక్లా ఇదే హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. సర్జరీ సమయంలోనే ఆయన చిపోయాడు. ఈ ఆపరేషన్ చేసింది డాక్టర్ నరేంద్ర జాన్ కెమ్ అనే లండన్ వైద్యుడు అని యాజమాన్యం ప్రకటించింది. ఇప్పుడు జాన్ కామ్ అసలు కథ బయటకు రావడంతో ఈ వ్యవహరంపైనా విచారణ కొనసాగే అవకాశం ఉంది. నిజానికి నరేంద్ర ఎలాంటి మెడికల్ విద్య అభ్యసించలేదు. ఆయన దగ్గర ఉన్న సర్టిఫికేట్లు అన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు. ఏ హాస్పిటల్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, ఆ హాస్పిటల్ కు తగినట్లుగా ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లు తయారు చేసుకుంటాడు. ఎన్నో స్పెషల్ డిగ్రీలు, ఇండియాతో పాటు ఫారిన్ లోనూ ఫేమస్ హాస్పిటల్స్ లో పని చేసినట్లు సర్టిఫికేట్లు ఉన్నాయి.
మాయ మాటలు చెప్పి మిషనరీ హాస్పిటల్లో చేరిక
ఇక మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మిషనరీ హాస్పిటల్ లో కార్డియాక్ సర్జన్ పోస్టు ఖాళీ కావడంతో ఓ నిపుణుడిని తీసుకోవాలని యాజమాన్యం భావించింది. ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన చూసిన జాన్ కామ్.. తానో బ్రిటన్ కార్డియాక్ సర్జన్ గా పరిచయం చేసుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇండియాలో పని చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆయన ఆలోచన బాగుందని, హాస్పిటల్ యాజమాన్యం ఈ పోస్టుకు ఎంపిక చేసింది. ఆయన వేషం, భాష చూసి బ్రిటిష్ పౌరుడేనని భావించింది. నెలకు రూ. 8 లక్షల సాలరీ ప్రకటించింది.
Read Also: పులిని భయపెట్టిన చేప.. ఏం కిక్కుంది మామా!
15 మందిలో ఏడుగురు మృతి
డాక్టర్ జాన్ కామ్ ఈ ఏడాది జనవరిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 15 గుండె ఆపరేషన్లు చేశాడు. వీరిలో ఏడుగురు చనిపోయారు. హాస్పిటల్ యాజమాన్యానికి అనుమానం కలిగింది. అదే సమయంలో పేషెంట్ల బంధువులు వైద్య అధికారులకు కంప్లైంట్ చేశారు. ఈ కేసుపై వైద్యశాఖ అధికారులు విచారణ చేశారు. డాక్టర్ కామ్ సరైన డిగ్రీలు లేకుండానే యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ చేసినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికీ పరారీలో ఉన్న డాక్టర్ జాన్ కామ్ అలియాస్ నరేంద్రను అరెస్టు చేశారు.