BigTV English

NTR: రౌడీ హీరోకి వాయిస్ ఇవ్వడం ఏమో కానీ.. ఆ లుక్ ఏదైతే ఉందో.. పూనకాలు అంతే

NTR: రౌడీ హీరోకి వాయిస్ ఇవ్వడం ఏమో కానీ.. ఆ లుక్ ఏదైతే ఉందో.. పూనకాలు అంతే

NTR: ఒక ఈవెంట్ లో మహేష్ బాబు.. మేము మేము బాగానే ఉంటాం.. మీరు బావుండాలి అని ఫ్యాన్ వార్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ అంతా ఒకటే. ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కి ఇంకో హీరో వస్తాడు. ఒక హీరో సినిమాకు ఇంకో హీరో వాయిస్ ఇస్తాడు. ఇలా ఒకరికొకరు ఇండస్ట్రీలో హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. మొన్నటికి మొన్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేశారు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడాలేకుండా అల్లు అర్జున్ సహాయం అన్నవారి కోసం ఏదో ఒక హెల్ప్ చేస్తాడు.


ఇక ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. రౌడీ హీరో కోసం రంగంలోకి దిగాడు. గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. లైగర్ సినిమాతో మొదలైన ప్లాప్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. గీతాగోవిందం కాంబో రిపీట్ అంటూ విజయ్ – పరుశురాం – దిల్ రాజు ముగ్గురు కలిసి ది ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా విజయ్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.

ఇక ఎలాగైనా ఈసారి మంచి హిట్ అందుకోవాలని విజయ్ ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం VD12. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


Saif Ali Khan – Kareena Kapoor : విడాకుల బాట పట్టబోతున్న స్టార్ కపుల్… ఆ పోస్ట్ తో కరీనా హింట్ ఇస్తోందా ?

ఎప్పటి నుంచో ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను రిలీజ్ చేయమని అభిమానులు గొడవ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాళ్ల గోల భరించలేక ఫిబ్రవరి 12 న VD12 టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఈ టీజర్ కోసం స్టార్ హీరోస్ ను రంగంలోకి దింపారు. ప్రతి భాషలో ఒక స్టార్ హీరోతో ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారు. ఇప్పటికే తమిళ్ లో సూర్య.. హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక తాజాగా తెలుగులో VD12 టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ను అందించనున్నాడు. దీనికోసం ఎన్టీఆర్ ను మీట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్.. విజయ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏమో కానీ.. ఫోటోలో ఎన్టీఆర్ న్యూ లుక్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యిపోయారు.దేవర కోసం కొద్దిగా బరువు పెరిగి కనిపించిన ఎన్టీఆర్.. ఇప్పుడు బరువు తగ్గి పర్ఫెక్ట్ బాడీతో కనిపించాడు.

అయితే ఈ లుక్ వార్ 2 కోసమా.. ? లేక ఎన్టీఆర్ – నీల్ సినిమా కోసమా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఎన్టీఆర్ – నీల్ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×