Akka: మహానటి కీర్తి సురేష్ పెద్దగా ప్లాన్ చేస్తుంది. నేను శైలజ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కీర్తిని చూసి.. ఎంత ఇన్నోసెంట్ గా ఉంది. ముద్దుగా, బొద్దుగా ఉంది.. ఈమె మా క్రష్ అని తెలుగు అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు. ఇక మహానటి సినిమాతో కీర్తి అంటే.. సావిత్రి. సావిత్రి అంటే కీర్తి అని చెప్పుకొచ్చారు. ఆ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిన్నది.. ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి హిట్ కొట్టాలని ప్రయత్నించింది.
మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, చిన్ని లాంటి సినిమాల్లో నటించింది. కానీ, అమ్మడికి మాత్రం అలాంటివేమీ హిట్ ను అందించలేకపోయింది. దీంతో కీర్తి ప్లాన్ మార్చి.. కొద్దిగా గ్లామర్ ట్రీట్ అందించడం మొదలుపెట్టింది. ఒకపక్క దసరా లాంటి డీ గ్లామర్ రోల్స్ చేస్తూనే ఇంకోపక్క బేబీ జాన్ లాంటి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలు అంటే నో అని చెప్పిన మహానటి.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టడానికి గతంలో చెప్పిన మాటలను గాలికి వదిలేసింది. బేబీ జాన్ లో అందాల ఆరబోత చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. ఈసారి పెద్ద ప్లాన్ వేసింది. ఇప్పటివరకు అమెజాన్ ఒరిజినల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ లోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్ అంటేనే బోల్డ్ కంటెంట్ కు కేరాఫ్ అడ్రెస్. ఇక్కడ సెన్సార్ లేదు కాబట్టి.. మరింత బూతు కథలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక తాజాగా కీర్తి నెట్ ఫ్లిక్స్ లోకి అక్కా అనే సిరీస్ తో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్నీ నెట్ ఫ్లిక్స్ అక్కా టీజర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా చెప్పుకొచ్చింది. ఇక ఈ సిరీస్ లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే మరో హీరోయిన్ గా నటిస్తోంది.
Kaantha: కాంత.. లక్కీ భాస్కర్ మరో హిట్ కొట్టేలా ఉన్నాడే..
ఇక అక్కా అనే టైటిల్ రోల్ లో కీర్తి నటిస్తున్నట్లు టీజర్ లో కనిపిస్తుంది. మహిళలను కాపాడే అక్కగా కీర్తి కనిపిస్తుంది. ఆమె చేసే పోరాటాలు.. ఆ సీరియల్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. రాధికా మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తుండగా.. కీర్తి మాత్రం నిండా చీరకట్టి.. నగలతో దర్శనమిచ్చింది. ఇక ఈ టీజర్ ను రిలీజ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ అక్కా స్టోరీ లైన్ ను తెలిపింది.
“మాతృస్వామ్యం బలంగా నిలుస్తుంది. ఒక తిరుగుబాటుదారుడు వారి పతనానికి పన్నాగం పన్నాడు. పేర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకుంటుంది. అక్కా త్వరలో వస్తుంది, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే” అంటూ రాసుకొచ్చింది. అసలు అక్క ఎవరు.. ? ఆమెను ఏం చేశారు.. ? మిగతా అక్కలు ఎవరు.. ? అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక టీజర్ ను బట్టే సిరీస్ అంతా బోల్డ్ గానే ఉంటుంది అని తెలుస్తోంది. ఇక ఈ టీజర్ ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అమ్మ బాబోయ్.. కీర్తీ అక్కా.. బోల్డ్ కంటెంట్ లోకి నువ్వు కూడా దిగావా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సిరీస్ తో కీర్తి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
The matriarchy stands strong. A rebel plots their downfall ♟️🔥 A girl from Pernuru seeks revenge against the Akkas.
Akka is coming soon, only on Netflix.#Akka#AkkaOnNetflix#NextOnNetflixIndia pic.twitter.com/IRM287inu0— Netflix India (@NetflixIndia) February 3, 2025