Bobby Chemmanur:మనిషికి అదృష్టం అందలాన్ని ఎక్కిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. అలా మహాకుంభమేళాలో రుద్రాక్ష పూసలు అమ్ముతూ పొట్టకూటి కోసం జీవనాన్ని కొనసాగించడానికి వచ్చిన ఒక అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె కళ్ళను చూసి మైమరిచిపోయిన ఒక వ్యక్తి ఏకంగా ఆమె ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఈమె అందానికి ముగ్దులైన చాలామంది ఈమె ఫోటోను షేర్ చేశారు. దీంతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది పూసల అమ్మాయి మోనాలిసా (Monalisa) . నాగిని లాంటి కళ్ళతో చూసేవారిని ఇట్టే మత్తెక్కిస్తూ తన అందంతో ఆకట్టుకుంది. దీంతో కలవాలని ఈమెతో ఫోటోలు దిగాలని కుంభమేళాకు వెళ్లిన ఎంతో మంది భక్తులు ఈమెను విసిగించారు. దీంతో చేసేదేమీ లేక అక్కడినుంచి తన సొంత గ్రామానికి వెళ్ళిపోయింది.
బాలీవుడ్ మూవీలో అవకాశం అందుకున్న కుంభమేళ మోనాలిసా..
అలాంటి ఈమెకు బాలీవుడ్ డైరెక్టర్ సినిమాలలో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సనోజ్ మిశ్రా (Sanoj Mishra) ఈమెకు సినిమాలలో అవకాశం కల్పిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడమే కాకుండా నేరుగా ఆమె స్వగ్రామం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్ లోని మోనాలిసా ఇంటికి వెళ్లి ఆమెతో తన సినిమాలో అవకాశం కల్పిస్తూ అగ్రిమెంటుపై సైన్ కూడా తీసుకున్నారు. అంతే కాదు ఇప్పుడు ఆమెకు నటనలో శిక్షణ కూడా నేర్పుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె తండ్రికి సినిమా పరిశ్రమ గురించి వివరించి, అన్ని సందేహాలను క్లియర్ చేశారట. ఇక దీంతో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జై సింగ్ కూడా తన కుమార్తె సినిమాల్లో నటించడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే సనోజ్ మిశ్రా ప్రారంభించే మూవీ షూటింగ్లో మోనాలిసా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
హనీ రోజ్ ను విసిగించిన వ్యాపారవేత్త వలలో చిక్కిన మోనాలిసా..
ఇదిలా ఉండగా తాజాగా మోనాలిసా బంపర్ గిఫ్ట్ అందుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ కేరళ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు (Bobby Chemmanur) ఆమె మెడలో బంగారు హారాన్ని వేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన వీడియో హల్చల్ చేస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రముఖ స్టార్ హీరో బాలయ్య(Balakrishna) బ్యూటీ హనీ రోజ్ (Honey Rose) ను చిత్రవధకు గురిచేసిన వ్యాపారవేత్తే ఈ బాబీ చెమ్మనూరు. ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమానికి మోనాలిసాకు దాదాపు రూ.15 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చారు.ఈ కార్యక్రమంలోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె మెడలో బంగారు నెక్లెస్ స్వయంగా తన స్వహస్తాలతో వేశారు. దాని విలువ పదివేల రూపాయలు అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హనీ రోజు తప్పించుకుంది ఇప్పుడు అతడి వలలో మోనాలిసా చిక్కుకుంది.. పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మోనాలిసా వయసు 15 సంవత్సరాలు మాత్రమే. ఈమెతో మోడలింగ్ చేయించి, తన వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోనున్నట్లు కూడా ప్రకటించారు. మరి మోనాలిసా పరిస్థితి ఏమవుతుందో అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">