BigTV English

Maha Kumbh Mela: నిన్న పళ్ల పుల్లలు, ఇవాళ ఛార్జింగ్ పుల్లలు.. కుంభమేళాలలో వ్యాపారస్తులకు డబ్బులే డబ్బులు!

Maha Kumbh Mela: నిన్న పళ్ల పుల్లలు, ఇవాళ ఛార్జింగ్ పుల్లలు.. కుంభమేళాలలో వ్యాపారస్తులకు డబ్బులే డబ్బులు!

Maha Kumbh Mela Business: కుంభమేళా పుణ్యమా అని ఎంతో మంది పేద వ్యాపారులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. పూసలు అమ్మేవారి నుంచి వేప పుల్లలు అమ్మేవారి వరకు దండిగా డబ్బులు వెనుకేసుకుంటున్నారు. భక్తుల అవసరాలను తీర్చుతూ ఆదాయాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. కుంభమేళా వేళ నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్నారు.


వేప పుల్లలు అమ్ముతూ..

యూపీలోని ప్రయాగరాజ్‌ లో ఈనెల 13 నుంచి మహా కుంభమేళా ఘనంగా జ‌రుగుతున్నది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. కోట్లలో వస్తున్న భక్తులతో ప్రయాగరాజ్‌ వ్యాపారుల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. యువకులు సైతం క్రేజీగా ఆలోచిస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. రీసెంట్ గా ఓ యువకుడు వే పుల్ల‌లు అమ్ముతూ వారంలో ఏకంగా రూ. 40వేలు సంపాదించాడు. రూపాయి ఖర్చు లేకుండా వేప పుల్లలు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో ప్రయాగరాజ్ లో వేప పుల్లలు అమ్ముతున్నట్లు చెప్పాడు.


ఒక్క ఛార్జింగ్ కు రూ. 50

ఇక మరో వ్యక్తి తాజాగా ఇంకో క్రేజీ వ్యాపారం మొదలు పెట్టాడు. కుంభమేళాకు వచ్చే భక్తుల్లో చాలా మంది సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులను క్యాష్ చేసుకునేందుకు ఓ యువకుడు ఛార్జింగ్ పాయింట్ పెట్టాడు. ఇక్కడ ఒక్కో ఛార్జింగ్ కు రూ. 50 వసూళు చేస్తున్నాడు. అత్యవసరం అనుకుంటే సెల్ ఫోన్ బ్యాటరీలో ఒక్కో పుల్లకు రూ. 10 వసూళు చేస్తున్నాడు. గంటకు సుమారు రూ. 1000 సంపాదిస్తున్నాడు. సాధారణంగా కుంభమేళాకు వచ్చే భక్తులు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, చాలా మంది ఫోన్లు త్వరగా ఛార్జింగ్ అయిపోతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా సంగం వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు తీసుకెళ్లనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇదే అదునుగా భావించి ఓ యువకుడు కుంభమేళాలో ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశాడు. బ్యాటరీలోని ఒక్కో పుల్లకు రూ. 10 వసూళు చేస్తున్నాడు. ఫుల్ ఛార్జింగ్ అయితే రూ. 50 తీసుకుంటున్నాడు. మొత్తంగా అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు కొనసాగుతోంది.

Read Also: దివికేగిన ఆ ప్రముఖులు.. కుంభమేళాలో స్నానమాచరిస్తే? పిచ్చెక్కిస్తున్న AI వీడియోలు!

నదిలో చిల్లర ఏరుకుంటున్న యువకులు

ఇక మరికొంత మంది యువకులు.. భక్తులు నదిలో విసిరిన కాయిన్స్ ను ఏరుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పొడవైన కర్రలకు అయస్కాంతాలు కట్టి నీటిలోనికి పెడుతున్నారు. అడుగు భాగంలో ఉన్న కాయిన్స్ వాటికి అతుక్కుంటున్నాయి. రోజంతా అలా చేయడం వల్ల ఒక్కొక్కరు రూ. 1000కి పైగా సంపాదిస్తున్నారు. వీరి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  మొత్తంగా కుంభమేళాలో ఒక్కొక్కరు ఒక్కోలా డబ్బులు సంపాదించుకుంటున్నారు.

Read Also: కాయిన్స్ తో కారుకు డెకరేషన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Read Also: Read Also: స్వచ్ఛమైన ‘ప్రేమ’ ఇక చరిత్రేనా.. నేటితరం ‘సింగిల్’గా మిగిలిపోవడానికి కారణాలు ఇవేనట!

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×