BigTV English

Captain Miller Ott Streaming: ఓటీటీలోకి ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Captain Miller Ott Streaming: ఓటీటీలోకి ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
Captain Miller Ott Streaming

Captain Miller Ott Streaming (today’s entertainment news):


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే తెలియని వారుండరు. ఈ హీరోకి తెలుగులోనూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు వస్తున్నాయంటే తమిళంతో పాటు తెలుగులోనూ హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్ల వద్ద ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేస్తారు. అంతటి క్రేజ్ ఉంటుంది ఆయనకి.. ఆయన సినిమాలకి. అలాంటి క్రేజ్‌తో తాజాగా తీసిన ఓ సినిమా మంచి హిట్ అయింది.

ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించి సినిమాకు వెన్నులా నిలిచారు. అలాగే ప్రియాంక అరుళ్ మోహన్, మాళవికా సతీషన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ధనుష్ కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో ప్రేక్షకుల ముందుకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.


వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్, రూ.45 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్‌ను రాబట్టి అందరినీ అబ్బురపరచింది. సినిమాపై ఎన్నో అంచనాలు ఉండటంతో దాదాపు రెండు వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా దాటుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. అయితే ఈ మూవీలో ధనుష్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నా.. సరైన ఎమోషన్స్ లేకపోవడంతో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక తెలుగు వెర్షన్ జనవరి 25న వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం పెద్దగా తన హవా చూపించలేక బోల్తా పడింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం కోటి వరకు మాత్రమే వసూళు చేసింది. అయితే తెలుగు నేటివిటీకి దూరంగా సాగడమే ఈ మూవీ పరాజయానికి దారి తీసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

దీంతో ఈ మూవీ రిలీజైన నెలలోపే ఓటీటీలో స్టీమింగ్ కావడానికి సిద్ధమైనట్లు తెలుస్తొంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. తాజా టాక్ ప్రకారం.. ఈ మూవీ ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో ‘కెప్టెన్ మిల్లర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×