BigTV English

Well : గుండ్రని బావులే ఎందుకు..? దాని వెనుకున్న సీక్రేట్ ఇదే..!

Well : బావులను మనమందరం పూర్వ కాలం నుంచే ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాం. పల్లెటూళ్లలో బావులు గుండ్రంగానే ఉండేవి. చతురస్రాలు, త్రిభుజాలు వంటి ఆకారాల్లో మనకు తక్కువగా కనిపిస్తాయి. సర్వకోటి జీవానికి నీరే ఆధారం. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నీరు తాగకుండా ఉండలేరు ఎవరూ. నీరు కేవలం తాగడానికే కాదు. ఇతర అవసరాలకు కూడా నీరు చాలా అవసరం. బావులు అసలు గుండ్రంగా అసలు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..? ఎప్పుడైనా మీరు ఆలోచించారా..? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బావి అనేది దాదాపుగా గుండ్రంగానే ఉంటుంది. ఒకప్పుడు బావులను సిమెంట్‌తో కూడిన గాజుతో నిర్మంచేవారు. బావుల నిర్మాణంలో గాజును ఉపయోగించడం వల్ల కూలిపోకుండా ఉంటాయి. బావుల గుండ్రని నిర్మాణం దానిని ధృడంగా ఉంచుతుంది. బావిలోని నీటి పీడనాన్ని గోడలపై సమానంగా ఉంచుతుంది. నీరు బావికి అన్ని వైపులా సమానంగా ఉంటాయి. దీని కారణంగా నీటి ద్వారా వచ్చే ఒత్తిడి తగ్గి కూలిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బావి గుండ్రంగా ఉంటే నీరు ఉబికి వస్తుంది. నీరు పైకి త్వరగా చేరుతుంది. అందువల్ల బావులు ఎక్కువ శాతం గుండ్రంగా ఉంటాయి.

బావులు చతురస్రాకారంలో తక్కువగా ఉంటాయి. బావి ఈ ఆకారంలో ఉండటం వల్ల నీరు పైకి రావడం కష్టంగా ఉంటుంది. దీంతో నీరు తోడుకోవడానికి కష్టంగా మారుతుంది. బావులను చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంలో తవ్వడం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఎక్కవగా బావులు గుండ్రంగా ఉంటాయి.

అయితే కొన్ని వ్యవసాయ బావులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. వీటిని అక్కడ భూగర్భ జలాల ఆధారంగా తవ్వుతారు. వ్యవసాయ బావులు రైతులు వారికి అనుగుణంగా తవ్వుతారు. చేద బావులు కచ్చితంగా గుండ్రంగా ఉంటాయి.

బావులను గుండ్రంగా తవ్వడం వల్ల ఎక్కువ కాలం ఉంటాయి. నిర్మాణం కూడా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. ఈ గుండ్రని నిర్మాణం ఎక్కువ నీటిని ఉత్పత్తి చేస్తుంది. నేటి కాలంలో బావులు తక్కువ అవుతున్నాయి. అందరూ బోర్‌వెల్‌ను ఉపయోగించడం వల్ల బావులు కనుమరుగవుతున్నాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×