BigTV English

MLC Venkat: అందరం తెలంగాణ బిడ్డలమే.. పీజీ స్టూడెంట్స్ పెద్ద మనసుతో ఉండాలి: ఎమ్మెల్సీ బల్మూరి

MLC Venkat: అందరం తెలంగాణ బిడ్డలమే.. పీజీ స్టూడెంట్స్ పెద్ద మనసుతో ఉండాలి: ఎమ్మెల్సీ బల్మూరి

MLC Balmoori Venkat Comments(Latest news in telangana): అందరం తెలంగాణ బిడ్డలమే.. యూజీ స్టూడెంట్స్ కొత్తగా వస్తారు కాబట్టి, పీజీ స్టూడెంట్స్ పెద్ద మనసుతో ఉండాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం నిజాం కాలేజీలో యూజీ స్టూడెంట్స్ ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన వారి వద్దకు వెళ్లారు. అనంతరం వారిని అడిగి సమస్యలు ఏంటో తెలుసుకున్నారు. హాస్టల్ సమస్యపై కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. అదేవిధంగా ఇతర సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా చొరవ చూపుతానంటూ హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం. హాస్టల్ మొత్తం తమకే కేటాయించాలని యూజీ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. పీజీ విద్యార్థులు 50 శాతం హాస్టల్ ను తమకు కేటాయించాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ కు మరో రెండు ఫ్లోర్లు నిర్మించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక ఈ సమస్య పరిష్కరించలేదు. గత 5 లేదా 6 ఏళ్ల నుండి బిల్డింగ్ నిర్మాణం చేస్తామని చెప్పింది తప్ప చేయలేదు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లేదా 2 ఫ్లోర్స్ నిర్మాణం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం. బడ్జెట్ కి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా మాట్లాడుతా.

Also Read: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్.. పడిపోతుందా..?


ఈ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను, విద్యార్థులను సరిగా పట్టించుకోలేదు. కానీ, మా ప్రభుత్వం అలా కాదు. భేషజాలలకు పోకుండా ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంది. యూజీ-పీజీ స్టూడెంట్స్ కూడా పంతాలకు పోకుండా సమస్య పరిష్కారం కోసం సహకరించాలి. అందరం తెలంగాణ బిడ్డలమే. యూజీ స్టూడెంట్స్ కొత్తగా వస్తారు కాబట్టి పీజీ స్టూడెంట్స్ పెద్ద మనసుతో ఉండాలి. పీజీ స్టూడెంట్స్ కు కావాల్సిన ఫెసిలిటీస్ చెప్పాలని కోరుతున్నాను’ అంటూ బల్మూరి పేర్కొన్నారు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×