BigTV English

Actor Darshan Arrested: బ్రేకింగ్.. ‘పోకిరి’ మూవీ రీమేక్ హీరో అరెస్ట్..!

Actor Darshan Arrested: బ్రేకింగ్.. ‘పోకిరి’ మూవీ రీమేక్ హీరో అరెస్ట్..!
Kannada actor Darshan Arrested in Murder Case: ప్రముఖ కన్నడ నటుడు ‘ఛాలెంజింగ్‌ స్టార్‌’ దర్శన్‌ హత్య కేసులో అరెస్ట్‌ అయ్యారు. నటుడు దర్శన్‌ని బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ నిందితుడని వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి దర్శన్‌తో పాటు మరో పది మందిని అరెస్టు చేశారు.
ముందుగా అరెస్టయిన నిందితులు నటుడు దర్శన్ పేరు వెల్లడించడంతో తగిన ఆధారాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. నటుడు దర్శన్‌ను ఈరోజు తెల్లవారుజామున మైసూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం మైసూరు నుంచి బెంగళూరుకు తీసుకువస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకు గురయ్యారు. ఆ హత్యకు సంబంధించి 9 మందిని పోలీసులు విచారించారు. ఆ విచారణలో వారు దర్శన్ పేరును ప్రస్తావించారు. దీంతో మైసూర్‌లోని తూగుదీప ఫామ్‌హౌస్‌లో దర్శన్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్నారు.
దర్శన్‌కు సన్నిహితురాలుగా పేరున్న నటి పవిత్ర గౌడకు స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. అందువల్లనే రేణుకస్వామిని హత్య చేసినట్లు సమాచారం. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి శనివారం రాత్రి సుమనహళ్లి వంతెన వద్ద శవమై కనిపించిన సంగతి తెలిసిందే. నిందితుల కాంటాక్ట్ లిస్టులో దర్శన్ నంబర్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. కాగా దర్శన్ కన్నడలో ఎన్నో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘పోకిరి’ మూవీని రీమేక్ చేశారు.


Tags

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×