BigTV English

Chandrababu on AP Capital : మన రాజధాని అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ: చంద్రబాబు ప్రకటన!

Chandrababu on AP Capital : మన రాజధాని అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ: చంద్రబాబు ప్రకటన!

Chandrababu Announcement on AP Capital: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వలేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు చంద్రబాబునాయుడు. ప్రజల తీర్పుతో మన బాధ్యత మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మన రాజధాని అమరావతేనన్న చంద్రబాబు.. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని, కర్నూల్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.


గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పూర్తిగా శిధిలమైందన్నారు చంద్రబాబు. పదవి వచ్చిందని విర్రవీగితే ఇలాంటి పరిస్థితే వస్తుందన్నారు. ఇదంతా కేస్ స్టడీ అవుతుందన్నారు. బూతులు మాట్లాడిన వారు, రౌడీయిజం చేసినవారిని ప్రజలు దూరంగా పెట్టారన్నారు. ఐదేళ్లు పాలించిన వ్యక్తి ప్రవర్తనకు ఇచ్చిన తీర్పు అన్నారు. తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. విధ్వంస, కక్ష రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. కేంద్ర సహాయం అవసరమని బీజేపీ నాయకత్వాన్ని కోరామని పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని వివరించారు. పవన్ సమయ స్పూర్తి ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందన్నారు. ఇందులో ఎలాంటి పొరపచ్చాలకు తావులేకుండా పనిచేశామన్నారు.


Also Read: PM Modi with Pawan, Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, అరుదైన ఘట్టం వెనుక…

పోలవరం ప్రాజెక్టు ముంపు నేపథ్యంలో ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయాన్ని వివరించారు చంద్రబాబు. ఫస్ట్ కేబినెట్‌లో దీన్ని ఆమోదించి ఆర్డినెన్స్ పెట్టి తర్వాత బిల్లులో పొందుపరిచారన్నారు. అప్పట్లో 72 శాతం పనులు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు, నదులు అనుసంధానం చేయడం, మన రాజధాని అమరావతి అని మరోసారి స్పష్టం చేశారు.

విశాఖను ఆర్థిక రాజధానిగా తయారు చేస్తామన్నారు చంద్రబాబు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పిన జగన్‌, ఆయనను అక్కడికి రాకుండా ఈసారి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇకపై పరదాలు కట్టుకోవడం, చెట్లు తొలగించడం అనేది ఇకపై ఉండదన్నారు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషేనన్నారు. సామాన్య వ్యక్తులగానే మీ దగ్గరకు వస్తామన్నారు చంద్రబాబు. హోదా అనేది సేవ కోసం తప్ప, పెత్తనం కోసం కాదన్నారు. ఏ ఒక్కరి ఆత్మ గౌరవానికి భంగం కలగకూడదన్నారు. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు.

Also Read: కూటమి సీఎంగా చంద్రబాబు.. అందుకే ప్రతిపాదిస్తున్నామన్న పవన్

విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్‌లో కూటమి శాసనసభా పక్ష సమావేశం జరిగింది. కూటమి తరపున సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. మిగతా సభ్యులు ఆయన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలు పనిచేశారన్నారు. జనసేన అయితే 100 శాతం గెలిచిందన్నారు. బీజేపీ పది సీట్లు తీసుకుంటే ఎనిమిది గెలవడం ఆషామాషీ కాదన్నారు. 1994 ఎన్నికలు ఒక సైడ్ జరిగినా, ఇన్ని సీట్లు రాలేదన్నారు చంద్రబాబు. మనం కేవలం 11 సీట్లలో మాత్రమే ఓడిపోయామన్నారు. 93 శాతం గెలవడం దేశ చరిత్రలో చాలా అరుదని చెప్పుకొచ్చారు. 57 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేకంగా కుర్చీని సిద్ధం చేశారు అధికారులు. దీన్ని ఆయన తిరస్కరించారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని చెప్పడంతో మరో కుర్చీని తెప్పించి దానిపై కూర్చొన్నారు చంద్రబాబు. ఆయన సంస్కారాన్ని చూసిన ఎన్డీయే ఎమ్మెల్యేలకు నోటి వెంట మాట రాలేదు.

Tags

Related News

YS Raja Reddy: రాజారెడ్డికి అమ్మమ్మ ఆశీర్వాదం.. తల్లితోపాటు అక్కడికి, జగన్ టీమ్‌లో కలకలం

CM Progress Report: ఏపీలో ఫేక్ న్యూస్‌పై ఫైట్ షురూ.. సీఎం సంచలన నిర్ణయం..

Road accident: మద్యం మత్తులో కారు డ్రైవర్.. ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి.. విజయనగరంలో ఘటన!

Hindu temples: గ్రహణంలోనూ తెరిచి ఉన్న ఏకైక ఆలయం.. ఏపీలో ఉందని మీకు తెలుసా!

Tirumala News: నేడు శ్రీవారిని దర్శించిన భక్తులెందరో తెలుసా? రేపటికి టీటీడీ సిద్ధం!

Visakhapatnam fire: పిడుగు పడి పేలిన పెట్రో ట్యాంక్.. విశాఖలో కలకలం!

Big Stories

×