Chandoo Mondeti: ఈరోజుల్లో భాషతో సంబంధం లేకుండా చాలావరకు హీరోలు, దర్శకులు అందరూ కలిసి పనిచేయాలని ఫిక్స్ అయిపోయారు. అందులోనూ ముఖ్యంగా టాలీవుడ్ హీరో, కోలీవుడ్ డైరెక్టర్ లేదా కోలీవుడ్ హీరో, టాలీవుడ్ డైరెక్టర్ కాంబినేషన్స్‌పై ప్రేక్షకుల్లో భారీగా హైప్ ఏర్పడుతోంది. అలాంటి సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా కాంబోలతోనే ఆడియన్స్‌లో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. అలాగే తాజాగా ‘తండేల్’తో హిట్ కొట్టిన తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో యంగ్ డైరెక్టర్ చందూ మోండేటి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా తెరపైకి ఒక టాలీవుడ్ యంగ్ హీరో పేరు వచ్చేసింది. దీంతో చందూ అప్‌కమింగ్ మూవీపై కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది.
సూర్యను పక్కన పెట్టినట్టే
అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా చందూ మోండేటి డైరెక్ట్ చేసిన సినిమానే ‘తండేల్’. ఈ మూవీతో నాగచైతన్య, చందూలకు ఒకేసారి సాలిడ్ హిట్ పడింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో విడుదలయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ‘తండేల్’ కంటే ముందు నుండే చందూ మోండేటికి టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. అందుకే కోలీవుడ్‌లో దర్శకుడిగా డెబ్యూ చేయాలని ఈ యంగ్ డైరెక్టర్ డిసైడ్ అయ్యాడు. ‘తండేల్’ తర్వాత సూర్యకు ఒక కథను వినిపించానని, అది దాదాపుగా ఓకే అయ్యిందని చందూ స్వయంగా ప్రకటించాడు. అలాంటిది సూర్యను పక్కన పెట్టి ఇప్పుడొక యంగ్ హీరోపై ఫోకస్ పెట్టాడు ఈ దర్శకుడు.
అంతా సెట్
ప్రస్తుతం సూర్య చేతిలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందుకే సూర్యతో సినిమా అంటే టైమ్ పట్టేలా ఉందని చందూ మోండేటి (Chandoo Mondeti) ఒక కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చాడు. తాజాగా యంగ్ హీరో రామ్ పోతినేనికి ఒక కథ వినిపించాడట చందూ. రామ్‌కు కూడా ఆ కథ బాగా నచ్చిందని, చందూతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. చందూ, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించడానికి సిద్ధమయ్యిందని తెలుస్తోంది. చందూ మోండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా ‘తండేల్’ కూడా గీతా ఆర్ట్స్ కో బ్యానర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంది.
Also Read: ప్రియుడితో కలిసి తమన్నా హోళీ వేడుకలు.. బ్రేకప్ రూమర్స్‌కు చెక్ పడినట్టేనా.?
లవ్ స్టోరీతో బిజీ
ప్రస్తుతం రామ్.. మహేశ్ బాబు అనే దర్శకుడితో కలిసి సినిమా చేస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మహేశ్ బాబు. ఇప్పుడు రామ్‌తో కలిసి మళ్లీ అలాంటి గుర్తుండిపోయే లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలాకాలం తర్వాత లవర్ బాయ్‌గా మారాడు రామ్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ రామ్ లుక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. దీని తర్వాత చందూతో సినిమాను ప్రారంభించే ఐడియాలో ఉన్నాడట రామ్.