Tamannaah: సినీ పరిశ్రమలో ఒక హీరో, హీరోయిన్ ఆఫ్ స్క్రీన్ చనువుగా కనిపిస్తే చాలు.. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఒకప్పుడు తమ పర్సనల్ విషయాలను, రిలేషన్‌షిప్ విషయాలను అందరితో షేర్ చేసుకోవడానికి సెలబ్రిటీలు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు రోజులు చాలావరకు మారిపోయాయి. చాలామంది సెలబ్రిటీలు ఓపెన్‌గానే తమ రిలేషన్‌షిప్ గురించి ఒప్పుకుంటున్నారు. అందులో తమన్నా కూడా ఒకరు. తమన్నా.. విజయ్ వర్మ అనే అప్‌కమింగ్ యాక్టర్‌ను ప్రేమిస్తున్నట్టుగా ఓపెన్‌గానే ప్రకటించింది. కానీ గత కొన్నాళ్లుగా వీరిద్దరికీ బ్రేకప్ అయిపోయింది అని రూమర్స్ వస్తుండగా.. తాజాగా ఆ రూమర్స్‌కు కాస్త బ్రేక్ పడినట్లు అయ్యింది.
బ్రేకప్ అయ్యిందా.?
తమన్నా, విజయ్ వర్మ కలిసి కొన్నాళ్ల క్రితం ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్‌లో నటించారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లకే ఈ ప్రేమ విషయం బయటపడింది. అప్పుడే తమన్నా ఆ వార్తలన్నీ నిజాలే అని క్లారిటీ ఇచ్చేసింది. అప్పటినుండి ఇప్పటివరకు తమన్నా, విజయ్ ఒక ఐడియల్ కపుల్‌లాగా సంతోషంగా ఉన్నారు. కానీ కొన్నాళ్ల క్రితం ఉన్నట్టుండి వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ వార్తలు వైరల్ అవ్వడం మొదలయ్యింది. తమన్నా కూడా తన సోషల్ మీడియాలో వింత పోస్టులు షేర్ చేయడంతో అందరూ ఆ బ్రేకప్ వార్తలు నిజమే అని ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా వీరిద్దరూ చేసిన పని.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది.
ఇద్దరూ ఒకేచోట
తాజాగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కలిసి హోళీని సెలబ్రేట్ చేసుకోవడానికి సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ఇంటికి వెళ్లారు. అదే హోళీ పార్టీకి తమన్నా, విజయ్ కూడా వెళ్లారు. ఇప్పటివరకు వీరి బ్రేకప్‌కు సంబంధించి వీరు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ హోళీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇద్దరూ ఒకే చోటికి చేరుకోవడంతో మరోసారి వీరికి సంబంధించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మొదలయ్యింది. అయితే తమన్నా, విజయ్.. ఈ పార్టీకి విడివిడిగానే వచ్చారు. వెళ్లేటప్పుడు కూడా కలిసి వెళ్లలేదు. దీన్ని బట్టి చూస్తే బ్రేకప్ వార్తలు కొంతవరకే నిజమే అనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: సల్మాన్ ఖాన్‌తో రష్మిక స్టెప్పులు.. పాపులర్ సాంగ్‌కు రీమిక్స్‌తో భాయ్ ఫ్యాన్స్‌కు ట్రీట్
క్లారిటీ ఇవ్వాల్సిందే
తమన్నా (Tamannaah), విజయ్ వర్మ ప్రేమికులుగా విడిపోయినా కూడా ఫ్రెండ్స్‌గా కలిసే ఉండాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వారిద్దరూ ఒకే హోళీ పార్టీకి హాజరయ్యారా అని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. తమన్నా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టగా విజయ్ వర్మ (Vijay Varma) మాత్రం అప్పుడే పెళ్లికి సిద్ధంగా లేకపోవడంతో ఈ బ్రేకప్ జరిగిందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అసలు వీరి బ్రేకప్‌లో నిజముందా, లేదా అనే విషయాన్ని వీరు కన్ఫర్మ్ చేసేవరకు ప్రేక్షకుల్లో క్లారిటీ రావడం కష్టమే. విజయ్, తమన్నా ఇద్దరూ రవీనా కూతురైన రాషాకు క్లోజ్ కావడంతోనే ఈ హోళీ వేడుకలకు హాజరయినట్టు సమాచారం.
#TamannaahBhatia pic.twitter.com/IxAbUiUYJC
— Achyut Kumar Dwivedi (@dwivediachyut41) March 14, 2025