BigTV English

Good Response to Chaari 111: థియేటర్ లో తుస్సుమని ఓటిటీలో ఆదరగోట్టేస్తున్న వెన్నెల కిషోర్..!

Good Response to Chaari 111: థియేటర్ లో తుస్సుమని ఓటిటీలో ఆదరగోట్టేస్తున్న వెన్నెల కిషోర్..!

Huge Response to Vennela Kishore’s Chaari 111 Movie in OTT: ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎలా ఉన్నారు అంటే.. ఎంతో కష్టపడి సినిమా తీస్తే థియేటర్ కు వెళ్లి ఛీఛీ ఏం సినిమా ఇది అని పెదవి విరిచేస్తున్నారు. అదే సినిమా ఓటిటీలో వస్తే.. వ్వావ్ సూపర్ .. సినిమా అంటే ఇది అని అనేస్తున్నారు. ఏ సినిమాను హిట్ చేస్తున్నారో.. ఏ సినిమాన ప్లాప్ చేస్తున్నారో వారికే అర్ధం కావడం లేదు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ? థియేటర్ లో తుస్సుమనిపించిన ఒక సినిమాను ప్రేక్షకులు ఓటిటీలో పెద్ద హిట్ చేసేశారు. ఆ సినిమానే చారి 111.


స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా పరిచయమైన చిత్రం చారి 111. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బర్కాస్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ నిర్మించారు. మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి చిత్ర బృందం సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం వలన అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అన్న విషయం కూడా చాలామందికి తెలియలేదు. ఇక కేవలం 16 రోజుల్లోనే చారి ఓటిటీలోకి అడుగుపెట్టాడు.

అమెజాన్ ప్రైమ్ లో మార్చి 16 నుంచి చారి 111 స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఓటిటీలో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీ జోనర్ కావడంతో కుటుంబం మొత్తం కలిసి చూసి నవ్వుకునేలా ఉండడంతో ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలబడింది. 70 మిలియన్స్ కి పైగా స్ట్రీమింగ్ వ్యూస్ ను అందుకొని స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా నిలబడింది. నిజంగా ఇది షాక్ అనే చెప్పాలి. ఏదిఏమైనా వెన్నెల కిషోర్ డెబ్యూ థియేటర్ లో హిట్ కాకపోయినా ఓటిటీలో మాత్రం భారీ హిట్ నే అందుకున్నాడు అని చెప్పాలి. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెలాంటి రికార్డ్స్ ను అందుకుంటుందో చూడాలి.


Also Read: Heroines: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్స్‌ను గుర్తుపట్టారా.. ?

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×