Ashutosh Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో 4 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ మ్యాచ్ లు అన్నియూ… చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే… తెరపైకి మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Captals) ప్లేయర్ అశుతోష్ శర్మ ( Ashutosh Sharma) వచ్చాడు. గత సీజన్ 2024 లో పంజాబ్ కింగ్స్ కు అశుతోష్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు. అయితే… ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశుతోష్ శర్మ ను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే.. వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోలేదు అశుతోష్ శర్మ. లక్నో జట్టుపై వీర విహారం చేశాడు.
Also Read: PBKS VS GT: గుజరాత్ తో పంజాబ్ ఫైట్… అయ్యర్ బిగ్ స్కెచ్…జట్ల వివరాలు ఇవే !
లక్నోకు చుక్కలు చూపించిన అశుతోష్ శర్మ
సోమవారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లో ( Delhi Capitals vs Lucknow Supergiants ) మ్యాచ్ లో తన ప్రతాపం మరోసారి చూపించాడు అశుతోష్ శర్మ. భయంకరమైన సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్ లో 31 బంతుల్లోనే.. 66 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సులు, 5 ఫోర్లు కూడా ఉన్నాయి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓడుతుందన్న సమయానికి మ్యాచ్ ను గెలిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు నరకం చూపించి… దుమ్ములేపాడు అశుతోష్ శర్మ. దీంతో ఒక్క వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్.
Also Read: Sanjiv Goenka: రిషబ్ పంత్ కు లక్నో ఓనర్ వార్నింగ్.. బండ బూతులు తిడుతూ !
ఎవరీ అశుతోష్ శర్మ ?
ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Captals) ప్లేయర్ అశుతోష్ శర్మ ( Ashutosh Sharma) మొన్నటి వరకు పంజాబ్ కింగ్స్ కు ఆడేవాడు. అక్కడ శశాంక్ తో కలిసి.. చాలా మంచి ఇన్నింగ్స్ లే ఆడాడు. ఇక మొన్నటి మెగా వేలంలో… 3.8 కోట్లకు అశుతోష్ శర్మ ( Ashutosh Sharma) ను ఢిల్లీ క్యాపిటల్స్ చాలా తెలివిగా కొనుగోలు చేసింది. అశుతోష్ శర్మ పూర్తి పేరు అశుతోష్ రాంబాబు శర్మ. 1998 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించాడు అశుతోష్ రాంబాబు శర్మ. ఇతనిది మధ్యప్రదేశ్. వయసు సంవత్సరాలు. కుడి చేతి వాటం బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్ తరఫున క్రికెట్ ఆడడమే కాకుండా రైల్వే జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు అశుతోష్ శర్మ. ఆ తర్వాత 24 లక్షలకు పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ 2024 లో డ్రాఫ్ట్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ తో 2024 ఏప్రిల్ 4వ తేదీన జరిగిన మ్యాచ్ లో… ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇక నిన్నటి మ్యాచ్ లో 31 బంతుల్లోనే.. 66 పరుగులు చేశాడు. దీంతో… ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ తరుణంలోనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) తొలి విజయాన్ని నమోదు చేసుకుంది ఢిల్లీ.
ASHUTOSH SHARMA IN THE LAST 7 BALLS:
– 6,4,6,2,6,4,6 🦁 pic.twitter.com/VrcWVn8LtH
— Johns. (@CricCrazyJohns) March 24, 2025