Chhavva Collections : బాలీవుడ్ ఇండస్ట్రీలో నుంచి ఈ ఏడాది మొదటగా వచ్చిన ఛావా ఫిబ్రవరి 14 న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. ఈ ఏడాది రిలీజ్ అయిన మిగిలిన సినిమాలకు షాకిస్తూ సక్సెస్ బాట పట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా భారీ విషయాన్నయితే సొంతం చేసుకుంది. అదే సినిమా తెలుగులో మార్చి 7న రిలీజ్ అయింది. అక్కడ ఉన్నంత బజ్ఇక్కడ లేదు కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినట్లు తెలుస్తుంది.. మరి తెలుగులో ఛావా మూవీకి మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఈ మూవీలో రష్మిక మందన్న, విక్కీ కౌశల్ జంటగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన చావా సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి అసలే బాగాలేదు, పైగా విక్కీ కౌశల్‌తో వంద కోట్ల బడ్జెట్ సినిమా అంటే రిస్క్ చాలా ఎక్కువ. అయినా కంటెంట్‌పై నమ్మకంతో చావా సినిమాను రూ.130 కోట్లతో నిర్మించారు. చత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై ఆసక్తి పెరిగే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు శంభాజీ వీరత్వం గురించి వినడమే తప్ప పెద్దగా జనాలకు తెలియదు. ఆయన గురించిన చరిత్రను చూడాలనే ఆసక్తి బాలీవుడ్ ప్రేక్షకుల్లో రేకెత్తించారు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు. కానీ ప్రతి ఒక్కరూ షాక్ అయ్యే విధంగా విక్కీ కౌశల్ నటనతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు కథను చక్కగా వెండి తెరపై ఆవిష్కరించారు.. శంభాజీ మహారాజ్ పాత్రకు ప్రాణం పోసినట్టుగా విక్కీ కౌశల్ నటించాడు అంటూ రివ్యూలు వచ్చాయి. అన్ని చోట్ల విక్కీ కౌశల్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాసుల వర్షం కురిపిస్తుంది. హిందీలో భారీ వసూళ్లను సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం..
Also Read :హమ్మయ్య… మొత్తానికి పవన్ మూవీ రీ రిలీజ్… బండ్లన్నను భలేగా ఒప్పించారు…
గీతా ఆర్ట్స్ సంస్థ ఛావాను తెలుగులో విడుదల చేసింది. అయితే విడుదలకు ముందు కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడం దుమారం రేపాయి.. మొత్తానికి ఈ మూవీ అనుకున్నట్టుగానే మార్చి 7న తెలుగులో రిలీజ్ అయింది.. ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే జరిగాయి అందులో రష్మిక మందన్న నటించడంతో ఈ సినిమాకు తెలుగులో భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్లుగానే తొలి రోజు తెలుగు ఛావా వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 3 కోట్ల ఓపెనింగ్స్‌తో రేసు మొదలెట్టింది.. ఇక వీకెండ్ కావడంతో శని ఆదివారాల్లో ఈ మూవీకి కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. బాలీవుడ్లో రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం తెలుగులో ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి.