BigTV English

CM Chandrababu: తెలుగింటి ఆడపడుచులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: తెలుగింటి ఆడపడుచులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు నా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు. ఇది ఒక సామాజిక బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.


తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ. 4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారాయన. అలాగే దీపం- 2 పథకం.. కింద 90 లక్షల మందికి పైగా.. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామనీ.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామనీ చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది జరుగుతుందని బలంగా నమ్మి పనిచేస్తున్నామనీ. మీ భద్రత, గౌరవం, సాధికారతకు మేము కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ.. మరొక్క మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.

స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు- లోకేష్


సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా శక్తి అపారం. సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారని తన విషెస్ ద్వారా తెలియ చేశారు.. మంత్రి నారా లోకేష్. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నామనీ. మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని అన్నారాయన. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామనీ. తమతమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాననీ తన మహిళాదినోత్సవ శుభాకాంక్షల ద్వారా తెలియ చేశారు మంత్రి లోకేష్.

Also Read: వివేకా కేసులో అసలేం జరుగుతుంది..? రంగన్న డెడ్ బాడీకీ

మహిళలందరికీ శుభాకాంక్షలు పలికిన వైసీపీ అధినేత జగన్

నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు చెప్పారు వైసీపీ అధినేత జగన్. మ‌హిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుందని గట్టిగా నమ్మే వ్యక్తిని తాననీ.. ఆ దిశగా తన ప్రభుత్వ కాలంలో మ‌హిళల అభ్యున్నతి, సాధికార‌తకు పెద్దపీట వేస్తూ పరిపాల‌న చేశామని అన్నారు జగన్. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా ప‌థ‌కాల‌ ద్వారా వారికి భ‌రోసా క‌ల్పించామని చెప్పారు జగన్.

నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చ‌ట్టం చేశామనీ. గిరిజ‌న‌, ద‌ళిత మ‌హిళ‌ల‌ను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద ప‌ద‌వుల‌తో గౌర‌వించామనీ. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టామనీ చెప్పారు జగన్. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న‌ నానుడిని న‌మ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని అన్నారాయన. తన భవిష్యత్ రాజకీయ ప్ర‌స్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధానంగా సాగుతుందని తన ట్వీట్ ద్వారా తెలియ చేశారు జగన్.

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×