Sankranthiki vasthunnam : టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వసూళ్ల పరంగా కూడా కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమాతో హీరో వెంకటేష్.. మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ ను బ్రేక్ చేస్తాడనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఆ రికార్డ్ ఏంటి? వెంకీ బ్రేక్ చెయ్యటం ఏంటో తెలుసుకుందాం.
వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూలు సాధిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.161 కోట్లు సాధించినట్టు సమాచారం. త్వరలోనే రూ.200 క్లబ్ లో కూడా చేరిపోతుందనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాతో హీరో వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న ఏకైక హీరో మెగాస్టార్ మాత్రమే. ఏ సీనియర్ హీరో ఈ రికార్డును అందుకోలేకపోయారు. అయితే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ “సంక్రాంతి వస్తున్నాం” సినిమా త్వరలోనే రూ.200 కోట్లు సాధిస్తే చిరు సరసన వెంకటేష్ కూడా చేరనున్నారు.
ఇక 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ లో రూ.200 కోట్ల పోస్టర్ ను సైతం పంచుకుంది. ఇక ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య రూ.200కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిరంజీవి మూడో సినిమాగా రికార్డ్ సృష్టించింది. అంతకు ముందు ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి.
ALSO READ : పవన్ కళ్యాణ్ వల్లే నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది.. బుల్లి రాజు కామెంట్స్
నిజానికి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి వెంకటేష్ కామెడీ మ్యాజిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించిన వెంకటేష్.. ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్న తీరు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా వెంకటేష్ కామెడీ టైమింగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. మంచి కథ నేపథ్యంతో పాటు వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షీ చౌదరి కామెడీ సినిమాకు మంచి రివ్యూ తీసుకువచ్చింది. పాటలతో పాటు యాక్షన్ సీన్స్ అదరగొట్టేయడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణతో ఏపీ, తెలంగాణలో ఆధారంగా 220+ స్క్రీన్స్ అదనంగా తీసుకొచ్చింది. దీంతో వసూళ్లపరంగా మరింత దూసుకుపోయే అవకాశం కనిపిస్తుంది. రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్”, బాలకృష్ణ “డాకు మహారాజ్” సినిమాలు సైతం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం క్రెడిట్ కొట్టేసిందనే చెప్పాలి