Rajasthan News: అదొక బడి. ఎందరో బాలల భవిష్యత్ కు బంగారు బాటలు వేసే బడి అది. చక్కని విద్యను అత్యుత్తమ క్రమశిక్షణతో బోధించాల్సిన ఉపాధ్యాయులే అక్కడ పక్కదారి పట్టారు. ఈ విషయం తెలిసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ లోని సలేరా ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
రాజస్థాన్ లోని సలేరా ప్రభుత్వ పాఠశాలలో ఎందరో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు మాత్రం చక్కని విద్యను అందించడం కంటే, విచక్షణ మరచి వ్యవహరించిన తీరుతో వార్తల్లో నిలిచారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కానీ, ప్రస్తుతం ఆ పాఠశాలకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఇద్దరు, ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలింతలు చేసుకుంటూ ఉన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలను అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే నెటిజన్స్ సీరియస్ కామెంట్స్ చేశారు.
Also Read: Viral News: ఆమెకు 19 మంది సంతానం.. అయితేనేమి రికార్డ్ బద్దలు కొట్టింది
సలేరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులుగా గుర్తించిన కొందరు అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. క్షణాల వ్యవధిలో వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఇంతకు ఈ వీడియో మార్ఫింగ్ చేశారా.. లేక వీడియోలో ఉన్న దృశ్యాలు వాస్తవమేనా అనే కోణంలో దర్యాప్తు చేసిన అధికారులు ఎట్టకేలకు అసలు విషయాన్ని గ్రహించి సదరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. చెడు మార్గంలో నడిచే విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవాలయం లాంటి పాఠశాలలో ఇలాంటి వికృత చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.