Sankranthiki Vasthunnam: సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలయినా కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలుస్తుంది. యూత్‌ను ఆకట్టుకునే సినిమాలు కేవలం హిట్ వరకు ఆగిపోతే.. ఫ్యామిలీస్‌ను ఆకట్టుకునే సినిమాలు సూపర్ హిట్ వరకు చేరుకుంటాయి. ఇక 2025 సంక్రాంతికి కూడా పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో ఫ్యామిలీస్ అందరికీ నచ్చి ఇప్పటికీ పలు చోట్ల హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో బుల్లి రాజుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర చాలామందిని ఇంప్రెస్ చేసింది. అసలు ఈ అవకాశం తనకు ఎలా వచ్చిందో తాజాగా బయటపెట్టాడు.
ఎలా వచ్చిందంటే?
అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. అలాగే మంచి హైప్ మధ్య ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) విడుదలయ్యింది. ఇది కచ్చితంగా ఈ కాంబోలో వచ్చే హ్యాట్రిక్ హిట్ అని ఫ్యాన్స్ ముందు నుండే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు నుండే ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇందులో అనుకోకుండా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అందరినీ డామినేట్ చేసింది. అదే బుల్లి రాజు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లి రాజు పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు రేవంత్. అసలు రేవంత్‌కు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తాజాగా బయటపడింది.
వైరల్ వీడియో వల్ల
‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్ కొడుకుగా కనిపించాడు రేవంత్. అందులో తను ఓటీటీ కంటెంట్‌కు బాగా అడిక్ట్ అయిపోయి, తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే బూతులు తిట్టడమే తన పని. అయితే ఇలాంటి ఒక ఫన్నీ క్యారెక్టర్‌లో నటించే అవకాశం రావడానికి పవన్ కళ్యాణే ముఖ్య కారణమని తాజాగా బయటపెట్టాడు రేవంత్. ‘‘నేను పవన్ కళ్యాణ్‌కు చాలా పెద్ద ఫ్యాన్. గతేడాది ఏపీలో జరిగిన ఎన్నికలకు జనసేన తరపున ప్రచారం కూడా చేశాను. నేను ప్రచారం చేస్తున్న సమయంలో చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అది అనిల్ రావిపూడి చూసి సంక్రాంతికి వస్తున్నాం కోసం ఆడిషన్ చేశారు’’ అని చెప్పుకొచ్చాడు రేవంత్.
Also Read: డైరెక్టర్ నుంచి మెసేజ్.. సమంత మోములో సిగ్గు మొగ్గలేసిందిగా..!
అలా చేయకూడదు
మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానమే తనకు ‘సంక్రాంతికి వస్తున్నాం’లో అవకాశం వచ్చేలా చేసిందని రేవంత్ బలంగా నమ్ముతున్నాడు. కారణం ఏదైనా ఇండస్ట్రీలోకి మంచి టాలెంట్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎంటర్ అయ్యాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో రేవంత్ కనిపించేది కాసేపే అయినా తను స్క్రీన్‌పైన కనిపించిన ప్రతీసారి ఆడియన్స్‌ను నవ్వించాడు. సినిమాలో తన క్యారెక్టర్ లాగా బయట పిల్లలు ఎవరూ చేయకూడదనే మెసేజ్ ఇందులో ఉందన్నాడు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు అనిల్ రావిపూడికి థాంక్యూ చెప్పుకున్నాడు. మరి ఈ క్యారెక్టర్.. రేవంత్‌కు మరెన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి.