BigTV English

Train Ticket: భలే.. జస్ట్ వాయిస్ కమాండ్‌తో నచ్చిన సీటు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!

Train Ticket: భలే.. జస్ట్ వాయిస్ కమాండ్‌తో నచ్చిన సీటు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!

Indian Ticket Booking: ఒకప్పుడు రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్ లోని కౌంటర్ కు వెళ్లి బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత IRCTC ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు చాలా మంది ఇంటి దగ్గర ఉంటే రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. రైల్వే ప్రయాణీకులలో సుమారు 75 శాతానికి పైగా ప్రయాణీకులు IRCTC యాప్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.


AskDISHA 2.0 ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన IRCTC

ప్రయాణీకులు ఈజీగా రైలు టికెట్లు బుక్ చేసుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది IRCTC. అందులో భాగంగానే సరికొత్త ఏఐ ఫీచర్ ను పరిచయం చేసింది. సులభంగా రైలు టికెట్లను బుక్ చేసేందుకు ఆస్క్ దిశ 2.0 అనే ఏఐ వర్చువల్ అసిస్టెంట్ సర్వీసులను అందిస్తోంది. ఈ ఫీచర్ తో టికెట్లతో పాటు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. PNR స్టేటస్, ట్రైన్ రియల్ టైమ్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. టికెట్ల క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీఫండ్ స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లుగా వర్చువల్ అసిస్టెంట్ తో చాట్ చేస్తూ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, వాయిస్ కమాండ్స్ తోనూ నచ్చిన బెర్త్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంది. IRCTC యూజర్లు కనీసం పాస్ వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి అవసరం లేదు. కానీ, ఓటీపీ అవసరం అవుతుంది.


Read Also:  దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?

AskDisha 2.0తో టికెట్ బుకింగ్ ఎలా?

రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుగా IRCTC వెబ్‌ సైట్ లేందంటే యాప్‌కి వెళ్లండి. ఇంటర్ ఫేస్ లో AskDisha చాట్ బాట్ కనిపిస్తుంది. IRCTC X అకౌంట్ లేదంటే WhatsApp ద్వారా కూడా AskDishaకు కనెక్ట్ కావచ్చు. ఈ టూల్‌కి వెళ్ళిన తర్వాత, ముందుగా  టికెట్ బుకింగ్ అని వాయిస్ కామాండ్ ఇవ్వాలి. లేదంటే టికెట్ బుకింగ్ అని టైప్ చేసి మెసేజ్ పంపించాలి. ఇది విన్న తర్వాత, మీరు వెళ్లాల్సిన రైలు వివరాలు అడుగుతుంది. ఆ తర్వాత చాట్‌బాట్ మిమ్మల్ని బుకింగ్ వివరాలను అడుగుతుంది. మీరు ఏ రైలును ఏ స్టేషన్ నుంచి ఎక్కాలి అనుకుంటున్నారు? ఎక్కడి వరకు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు? అనే వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీ, మీరు ప్రయాణించాలనుకుంటున్న క్లాస్ లాంటి వివరాలను కూడా చెప్పాలి. పూర్తి వివరాలను ఇచ్చిన తర్వాత  టికెట్ బుక్ చేసుకోవడానికి చెల్లింపు ఆప్షన్ ను అడుగుంది.UPI, క్రెడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లాంటి ఆప్షన్స్ లో మీకు నచ్చిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత మీ టికెట్ బుకింగ్ అవుతుంది. PNR నంబర్ లభిస్తుంది. ఇక హ్యాపీగా మీరు ట్రైన్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది.

Read Also:  ఇకపై టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్ లోకి ఎంట్రీ, రైల్వేశాఖ కీలక నిర్ణయం!

Related News

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలకు నో ప్లేస్!

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Big Stories

×