BigTV English

Chiranjeevi: చిరంజీవిని డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్..

Chiranjeevi: చిరంజీవిని డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్..

Chiranjeevi:ఏంటి.. నిజమా.. ?  హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేశాడా.. ? ఎప్పుడు జరిగింది.. ? అని కంగారుపడకండి. హరీష్ డైరెక్షన్ లో చిరంజీవి నటించాడు. కానీ, అది సినిమా కాదు. కేవలం యాడ్ మాత్రమే. ఈ మధ్యనే మిస్టర్ బచ్చన్ సినిమాతో హరీష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా రిలీజ్ అవ్వకముందు హరీష్ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.


నిజంగా హరీష్ ఇచ్చిన హైప్ లో కొద్దిగా కథలో కూడా  ఉంది ఉంటే.. మిస్టర్ బచ్చన్  మంచి విజయాన్ని అందుకొని ఉండేది. అయితే కథ మొత్తం తేడా కొట్టడంతో  ప్రేక్షకులు  సినిమాకు నెగటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా తరువాత హరీష్ చేతిలో ఉస్తాద్  ఉంది.

ఇది కాకుండా హరీష్, చిరుతో ఒక సినిమా చేస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో.. ఆమ్మో.. హరీష్ శంకరా.. ? మళ్లీ ఏ రీమేక్ ను తీసుకొస్తున్నాడో.. వద్దు బాస్ అని  ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక హరీష్- చిరంజీవి కలిసింది  సినిమా కోసం కాదట. ఒక యాడ్  చేయడానికి కలిసినట్లు తెలుస్తోంది.


ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్  ఊపిరి  పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి కూడా చిరు ఫుల్ గా కాకపోయినా.. కొన్ని ప్రోడక్ట్స్  కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేవాడు.

ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక యాడ్ షూట్ కోసమే చిరు – హరీష్ కలిశారు. అయితే ఈ యాడ్ కమర్షియల్ కు సంబంధించిందా.. ? లేక  సోషల్  ఎవెర్ నెస్ కు సంబంధించిందా .. ? అనేది తెలియాల్సి ఉంది.  హరీష్ ఇంకోపక్క.. యాడ్ షూట్ తో చిరును మెప్పించి.. సినిమా తీసే ఛాన్స్ పట్టేసే  ప్లాన్ లో ఉన్నాడని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×