BigTV English

India Defence : ఆ డ్రోన్లు మాకొద్దు – 400 డ్రోన్ల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ ఆర్మీ

India Defence : ఆ డ్రోన్లు మాకొద్దు – 400 డ్రోన్ల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ ఆర్మీ

India Defence : రక్షణ రంగంలో కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించేందుకు వినియోగించే డోన్లలో చైనా విడిభాగాలు వినియోగించారనే కారణంగా.. భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా విడిభాగాలు వినియోగించారనే కారణంగా.. 400 మానవ రహిత విమానాల కొనుగోలును రద్దు చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు రూ.230 కోట్లుకు పైగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా.. దేశానికి సంబంధించిన కీలక రక్షణ విషయాలు బహిర్గతం అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఇప్పటి నుంచి దేశ రక్షణ, భద్రత రంగాల్లో వినియోగించే డ్రోన్లు, మానవరహిత విమానాల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించింది.


భారత రక్షణ అవసరాల కోసం దేశీయ ప్రైవేట్ రంగ డ్రోన్ తయారీ సంస్థలకు అనేక కాంట్రాక్టులు ఇచ్చింది. అయితే.. ఆయా సంస్థలు మానవరహిత వైమానిక వాహనాలలో (UAV) చైనా భాగాలను ఉపయోగించినట్లు తేలడంతో.. సాయుధ దళాల కోసం కుదుర్చుకున్న 400 డ్రోన్‌ల కొనుగోలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇందులో.. మూడు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు ఉండగా.. ఆ సంస్థలు 200 మీడియం-ఆల్టిట్యూడ్, 100 హెవీ-వెయిట్, 100 లైట్-వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్‌లను సరఫరా చేసేందుకు అంగీకరించాయి. వీటిలో చెన్నైకి చెందిన ఒక కంపెనీ కూడా ఉండగా.. ఈ ఒప్పందాలు 2023లో జరిగినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయంగా చైనా టెక్నాలజీ, చైనా పరికరాలపై అనేక అనుమానాలున్నాయి. అక్కడి నుంచి వచ్చే ఏ ఉత్పత్తులైనా ఆ దేశ సైన్యం, ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తాయని ఆరోపణలున్నాయి. అందుకే.. మన నిఘాలో కీలకంగా పని చేసే డ్రోన్లలో ఆ దేశం నుంచి వచ్చే పరికరాల్ని వినియోగించడంపై సైన్యం అత్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అలా విడి భాగాలు వాడడం వల్ల అతిపెద్ద సైబర్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. కీలకమైన డేటా భద్రత, ఇతర కార్యకలాపాల విషయంలో ముప్పులు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రమాదకర దేశాల నుంచి వచ్చే వస్తువులను వాడితే.. ఆ దేశాలు అవసరమైన సందర్భాల్లో మన డ్రోన్లను నియంత్రించడం, స్వాధీనం చేసుకోవడం తో పాటు జామింగ్ ద్వారా దానిని సాఫ్ట్ కిల్ చేయవచ్చని చెబుతున్నారు. తాజా నిర్ణయం తర్వాత రక్షణ డ్రోన్లలో ఏ విధమైన చైనా భాగాలు లేదా ఎలక్ట్రానిక్స్, హానికరమైన కోడ్స్ వినియోగించలేదని నిర్ధారించడానికి కఠినమైన చర్యలు చేపట్టనున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.


Also Read : అక్రమ వలసదారుల ఫిర్యాదులు – ట్రావెల్ ఏజెంట్లపై పోలీసు కేసులు

ప్రస్తుతం కొనుగోలు చేయాలనుకున్న డ్రోన్లను 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ ఉన్న చైనా వెంబడి మోహరించాలని అనుకున్నారు. కానీ.. ఇటీవల జరిగిన ఓ ప్రమాదకర ఘటన తర్వాత రక్షణ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ ఘటన ఆగస్టు 2024లో పాక్ నియంత్రణ రేఖ వెంబడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో.. పదాతిదళ విభాగం పాక్ బోర్డర్ వెంట ఫిక్స్‌డ్-వింగ్ UAVపై నియంత్రణ కోల్పోయి… పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోకి దూసుకెళ్లింది. అలా వెళ్లడం ద్వారా మనం  వినియోగిస్తున్న డ్రోన్ల సమాచారం, మనం వారిపై నిఘా ఉంచిన తీరుతో పాటు అనేక సున్నితమైన సమాచారం శత్రువుల చేతికి చిక్కే అవకాశం ఉంటుంది. అందుకే.. ఈ ఘటనపై రక్షణ శాఖ చేపట్టిన చర్యల్లో భాగంగా.. చైనా పరికరాలు, సాంకేతికతల వినియోగంపై తీవ్ర ఆంక్షలు పెడుతోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×