Ibrahim Ali Khan: బాలీవుడ్‌లో ఇంకా చాలామంది నెపో కిడ్స్ తమ డెబ్యూకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నెపో కిడ్స్ డెబ్యూ చేస్తానంటే చాలు.. చాలామంది దర్శక నిర్మాతలు వారిని లాంచ్ చేయడం కోసం క్యూ కడుతుంటారు. అలాగే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ లాంచ్‌కు సమయం వచ్చేసిందని అర్థమవుతోంది. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మొదటి భార్య అమృత సింగ్‌కు ఇద్దరు పిల్లలు కాగా.. అందులో ఒకరైన సారా అలీ ఖాన్ ఇప్పటికే హీరోయిన్‌గా లాంచ్ అయ్యి తన సత్తా చాటుకుంటోంది సారా. ఇప్పుడు ఇది ఇబ్రహీం వంతు. ఇప్పటికే ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ గురించి పలు వార్తలు బయటికి రాగా వాటిపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశాడు కరణ్ జోహార్ (Karan Johar).
అందరితో అనుబంధం
చాలావరకు బాలీవుడ్‌లో నెపో కిడ్స్ అందరినీ కరణ్ జోహారే లాంచ్ చేశాడు. ఇప్పుడు ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) విషయంలో కూడా అదే జరుగుతోంది. తాజాగా ఇబ్రహీంకు సంబంధించిన ఒక హాట్ ఫోటోషూట్‌ను షేర్ చేసిన కరణ్.. దాంతో పాటు ఒక ఆసక్తికర నోట్‌ను అటాచ్ చేశాడు. అందులో తన తండ్రి గురించి, తల్లి గురించి, వారితో కలిసి చేసిన సినిమాల గురించి గుర్తుచేసుకున్నాడు. ‘‘నేను అమృత లేదా తనను అందరూ ప్రేమగా డింగీ అని పిలుస్తారు కాబట్టి డింగీని 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కలిశాను’’ అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్.
ఫస్ట్ మీట్
‘‘అమృత నా తండ్రితో కలిసి ధర్మ మూవీస్ బ్యానర్‌లో దునియా అనే సినిమా చేసింది. తన గ్రేస్, ఎనర్జీ, కెమెరా ముందు తన ధైర్యం అంతా కొంచెంకొంచెంగా గుర్తున్నాయి. కానీ నాకు బాగా గుర్తుంది మాత్రం తనతో కలిసి చేసిన చైనీస్ డిన్నర్, కలిసి చూసిన జేమ్స్ బాండ్ మూవీనే. తను నన్ను కలిసిన వెంటనే సొంత కొడుకులాగా చూసుకుంది. అదే గ్రేస్ తన పిల్లలకు కూడా వచ్చింది. సైఫ్ అలీ ఖాన్‌ను నేను మొదటిసారిగా ఆనంద్ మహేంద్రు ఆఫీస్‌లో కలిశాను. యంగ్, చార్మింగ్‌గా కనిపించాడు. ఇబ్రహీంను మొదటిసారి చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. అదే ఫ్రెండ్‌షిప్ అప్పటినుండి ఇప్పటివరకు కంటిన్యూ అవుతోంది’’ అని గుర్తుచేసుకున్నాడు కరణ్.
Also Read: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నా ఇన్‌స్పిరేషన్.. నెపో కిడ్ షాకింగ్ స్టేట్‌మెంట్
అది వారి రక్తంలో ఉంది
‘‘నాకు ఈ కుటుంబం 40 ఏళ్లుగా తెలుసు. అమృత, సైఫ్, సారా అలీ ఖాన్‌తో నేను కలిసి పనిచేశాను. ఈ కుటుంబమంతా ఎలాంటిదో నాకు తెలుసు. సినిమాలు తమ రక్తంలో, జీన్స్‌లో ప్యాషన్‌గా ఉండిపోయాయి. అందుకే కొత్త టాలెంట్‌కు దారి అందిస్తున్నాను. ఈ ప్రపంచానికి దానిని చూపించడానికి ఎదురుచూస్తున్నాను. ఇబ్రహీం అలీ ఖాన్ మీ మనసులో ముద్ర వేయడానికి వెండితెరపైకి వచ్చేస్తున్నాడు’’ అంటూ కరణ్ జోహార్ ప్రకటించాడు. ఈ సినిమాను కునాల్ దేశ్‌ముఖ్ డైరెక్ట్ చేస్తుండగా ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికయ్యింది. అచ్చం తన తండ్రిలాగానే ఉండే ఇబ్రహీం.. అతడిలాగానే ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరో అవ్వగలడా లేదా చూడాలి.
Born to shine, crafted to conquer! 🌟⁰#IbrahimAliKhan is here, and the spotlight has found its next favorite! 🎬❤️ pic.twitter.com/VJk5v5rZHj
— Dharma Productions (@DharmaMovies) January 29, 2025